Senior Citizens: సీనియర్ సిటిజన్లకి అలర్ట్‌.. అన్ని స్కీంలలో కంటే ఇందులోనే వడ్డీ ఎక్కువ..!

Senior Citizens: సీనియర్ సిటిజన్లకి అలర్ట్‌.. అన్ని స్కీంలలో కంటే ఇందులోనే వడ్డీ ఎక్కువ..!
x
Highlights

Senior Citizens: ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది.

Senior Citizens: ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం మొదటి త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లలో మార్పు చేయనుంది. ప్రధానంగా సీనియర్ సిటిజన్లకు మరింత ఉపశమనం కల్పించడానికి వడ్డీరేట్లని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండోసారి కూడా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) వడ్డీ రేట్లను పెంచవచ్చు.

ఈసారి పెంపుదల 50 నుంచి 75 బేసిస్ పాయింట్లు ఉంటాయని అంచనా. తర్వాత సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లు 8 శాతం కంటే ఎక్కువగా ఉంటాయి. డిసెంబర్‌లో 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో SCSSలో వడ్డీ రేట్లు మార్చిన సంగతి తెలిసిందే. ఇందులో 40 బేసిస్ పాయింట్లు పెంచి వడ్డీ రేట్లను 8 శాతానికి పెంచారు.

ఎందుకు పెరుగుదల..

నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచవచ్చు. గత కొన్ని త్రైమాసికాల్లో పాలసీ రేటులో పెరుగుదల ఉంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)పై అందించే వడ్డీ రేట్లు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా సీనియర్ సిటిజన్ల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడానికి SCSS రేట్లను పెంచడం అవసరం. ప్రస్తుత ఆర్థిక వాతావరణాన్ని పరిశీలిస్తే ఈ పథకాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అందరు భావిస్తున్నారు.

ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది

బడ్జెట్ 2023లో ప్రకటించిన విధంగా ప్రభుత్వం SCSS పథకం కోసం కొత్త పెట్టుబడి పరిమితిని త్వరలో తెలియజేస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రకటనపై అధికారిక నోటిఫికేషన్ ఇంకా వెలువడాల్సి ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్ల వారి SCSS ఖాతాలలో రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేయడానికి అనుమతి ఉంటుందని తెలిపారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం SCSS ఖాతాలలో రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా సీనియర్ సిటిజన్లు వడ్డీ నెలకు రూ.20,000 వరకు సంపాదించవచ్చు. SCSS ఖాతా మెచ్యూరిటీ వ్యవధి తర్వాత 8 శాతం వడ్డీ అందుతుంది. ఖాతాదారుడు తన పథకాన్ని మూడేళ్లపాటు పొడిగించుకునే అవకాశాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories