Ujjwala Scheme: మహిళలకి అలర్ట్‌.. ఉజ్వల పథకం కింద 9 కోట్ల మందికి లబ్ధి..!

Good News for Women Govt Extended Subsidy Under Ujjwala Scheme
x

Ujjwala Scheme: మహిళలకి అలర్ట్‌.. ఉజ్వల పథకం కింద 9 కోట్ల మందికి లబ్ధి..!

Highlights

Ujjwala Scheme: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు ప్రభుత్వం గొప్ప వార్త అందించింది.

Ujjwala Scheme: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు ప్రభుత్వం గొప్ప వార్త అందించింది. ఎల్‌పిజి సిలిండర్‌పై రూ.200 సబ్సిడీని పొడిగించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం 9.6 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దీనికి ఆమోదం తెలిపిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

సంవత్సరానికి 14.2 కిలోల 12 ఎల్‌పిజి సిలిండర్లకు ఈ సబ్సిడీ అందుతుంది. ఈ పథకం కింద మార్చి 1, 2023 నాటికి 9.59 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందుకోసం 2022-23లో రూ.6,100 కోట్లు, 2023-24లో రూ.7,680 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి తెలిపారు. ఇందులో సబ్సిడీని నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. వివిధ అంతర్జాతీయ సంఘటనల కారణంగా ఎల్‌పిజి ధర వేగంగా పెరిగిందని ఠాకూర్ తెలిపారు.

LPG అధిక ధరల నుంచి ఉజ్జ్వల యోజన లబ్ధిదారులను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. PMUY వినియోగదారుల సగటు ఎల్పీజీ వినియోగం 2019-20లో 3.01 రీఫిల్స్ నుంచి 2021-22లో 3.68కి అంటే 20 శాతం పెరిగింది. PMUY లబ్ధిదారులందరికీ ఈ సబ్సిడీ లభిస్తుంది. గ్రామీణ, నిరుపేద పేద కుటుంబాలకు స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించడానికి మే 2016లో ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories