EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..ప్రభుత్వం కీలక ప్రకటన

Good news for PF customers..Government key announcement
x

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..ప్రభుత్వం కీలక ప్రకటన

Highlights

EPFO:పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది.

EPFO:ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రంలోని మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ అకౌంట్లోని ఫండ్స్ పై తాజా వడ్డీ రేట్ల మేరకు రిటర్న్స్ అందుకుంటున్నారు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజెషన్, రివైజ్డ్ ఈపీఎఫ్ వడ్డీ రేట్లు చెల్లిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే అవుట్ గోయింగ్ సభ్యులకు వారి ఫైనల్ పీఎఫ్ సెటిల్ మెంట్స్ లో కొత్త వడ్డీలు వర్తింపజేసినట్లు ప్రకటించింది.

పదవీ విరమణ చేస్తున్న ఈపీఎఫ్ సభ్యులు వారి పీఎఫ్ సెటిల్ మెంట్స్ తో పాటు వడ్డీని పొందుతున్నారు. మరి ఈ వడ్డీ చెల్లింపులు యాక్టివ్ మెంబర్స్కు ఎప్పుడు అందుతాయి. అకౌంట్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భారత ప్రభుత్వం 2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25శాతంగా నిర్ణయించింది. 2024 మే 31న కొత్త రేటును ప్రకటించింది. ఈపీఎఫ్ వడ్డీ రేట్లు ఇక ప్రతి త్రైమాసికంలో వెల్లడించమని..వార్షిక రేటును ఆర్ధిక సంవత్సరం ముగిసిన తర్వాత సాధారణంగా తర్వాత సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రకటిస్తామని తెలిపింది. దీనికి సంబంధించి ఈపీఎఫ్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ లో గతంలో ఓ పోస్టు చేసింది. అందులో ఈపీఎఫ్ సభ్యుల వడ్డీ రేటు క్వార్టర్లీ డిక్లేర్ చేయము. వచ్చే ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్ధిక సంవత్సరం ముగిసిన తర్వాత వార్షిక వడ్డీ రేటు ప్రకటిస్తామని తెలిపింది. దీని ప్రకారం ఈపీఎఫ్ సభ్యులకు 2023-24 ఆర్ధిక సంవత్సరానికి 8.25శాతం వడ్డీ రేటును భారత ప్రభుత్వం ఆమోదించింది.

ఫైనల్ పీఎఫ్ సెటిల్ మెంట్స్ తో అవుట్ గోయింగ్ సభ్యులకు కొత్త రేట్లు ఇప్పటికే చెల్లిస్తున్నట్లు వివరించింది. ఇప్పటి వరకు 23,04,516 క్లెయిమ్స్ సెటిల్ అయ్యాయని తెలిపింది. 8.25శాతం తాజా వడ్డీ రేటుతో రూ. 9260,40,488మొత్తాన్ని సభ్యులకు పంపిణీ చేశారు. అయితే యాక్టివ్ ఈపీఎఫ్ సభ్యులు ఎఫ్ ఐ 2023-24కు సంబంధించి తమ వడ్డీ చెల్లింపులను ఎప్పుడు స్వీకరిస్తారనే దానిపై ఈపీఎఫ్ఓ ఇంకా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దీంతో చాలా మంది సభ్యులు సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories