Pre-Approved Loan: ఆ బ్యాంకు ఖాతాదారులకి గుడ్‌న్యూస్.. ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్..!

Good News for Indian Bank customers Pre-Approved Personal Loan Offer | Business News
x

Pre-Approved Loan: ఆ బ్యాంకు ఖాతాదారులకి గుడ్‌న్యూస్.. ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్..!

Highlights

Pre-Approved Loan: నిధుల కొరతను ఎదుర్కొంటున్న వారికి ఈ సౌకర్యం ప్రయోజనకరంగా ఉంటుంది...

Pre-Approved Loan: అక్షయ తృతీయ రాబోతోంది. ఈ సమయంలో మీరు బంగారం, ఇతర వస్తువులను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే చింతించకండి. ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. నిధుల కొరతను ఎదుర్కొంటున్న వారికి ఈ సౌకర్యం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇండియన్ బ్యాంక్ తన 'వరల్డ్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ వర్చువల్ ఎక్స్‌పీరియన్స్' (వేవ్) కింద ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ (PAPL)సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇందుకోసం జనవరి 2022లోనే వేవ్ ప్రాజెక్ట్‌ను ప్రవేశపెట్టింది.

ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ CEO SL జైన్ మాట్లాడుతూ.. "ఈ సంవత్సరం ప్రారంభంలో వేవ్ ఉత్పత్తితో డిజిటల్ లావాదేవీలను పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. మా మొదటి డిజిటల్ ఆఫర్ PAPL.ఈ ఆఫర్ పూర్తిగా డిజిటల్ మాధ్యమం ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్‌తో రుణగ్రహీతలకు బ్యాంక్ మరో సదుపాయాన్ని అందిస్తుంది.

దీని కింద మీరు ఎటువంటి ముందస్తు చెల్లింపు ఛార్జీలు లేకుండా నిర్ణీత సమయానికి లోన్‌ క్లోజ్‌ చేయవచ్చు. అలాగే ఈ రుణంపై వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు దీనిపై సంవత్సరానికి 10 శాతం చొప్పున వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. శాలరీ అకౌంట్‌లో సాధారణ ఆదాయం లేదా పెన్షన్ వస్తున్న బ్యాంకు ప్రస్తుత కస్టమర్‌లు ముందస్తుగా వ్యక్తిగత రుణాన్ని (PAPL) పొందవచ్చు. మీరు యాప్, వెబ్‌సైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ లోన్‌ను పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories