ప్రభుత్వ ఉద్యోగులకి అలర్ట్‌.. దానిపై కీలక ప్రకటన వచ్చే అవకాశం..!

Good News for Government Employees There is a Possibility of a Huge Announcement on Dearness Allowance
x

ప్రభుత్వ ఉద్యోగులకి అలర్ట్‌.. దానిపై కీలక ప్రకటన వచ్చే అవకాశం..!

Highlights

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించనుంది.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించనుంది. మంత్రివర్గ సమావేశంలో డియర్‌నెస్ అలవెన్స్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డీఏ అంశం చాలా కాలంగా ఉద్యోగుల డిమాండ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు కరోనా కేసులకు సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పలు నిర్ణయాలు తీసుకోవచ్చు.

కేంద్ర ఉద్యోగులు 4 శాతం పెంపుతో 42 శాతం డియర్‌నెస్ అలవెన్స్ చెల్లింపుకు ఆమోదం పొందవచ్చు. నిజానికి కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ పెంపుపై కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యేక కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులకు సంబంధించి పెద్ద ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4 శాతం పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీని తర్వాత ఉద్యోగుల డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి పెరుగుతుంది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం రాలేదు.

కొన్ని ముఖ్యమైన విషయాలు

1. ప్రస్తుతం కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 38 శాతం కరువు భత్యం పొందుతున్నారు.

2. DAలో చివరి సవరణ సెప్టెంబర్ 28, 2022న జరిగింది. ఇది జూలై 1, 2022 నుంచి అమలులోకి వచ్చింది.

3. జూన్ 2022తో ముగిసే కాలానికి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 12-నెలవారీ సగటు పెరుగుదల శాతం ఆధారంగా కేంద్రం నాలుగు శాతం పాయింట్ల నుంచి 38 శాతానికి పెంచింది.

4. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని భర్తీ చేయడానికి ఉద్యోగులు, పెన్షనర్లకు DA అందించాలి.

5. కాలంతో పాటు జీవన వ్యయం పెరుగుతుంది.

6. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.26,000కు పెరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories