EPS 95 Pension: ఈపీఎస్ 95 పెన్షన్ స్కీం ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్.. పెన్షన్ 15వేలు అయ్యే ఛాన్స్

EPS 95 Pension: ఈపీఎస్ 95 పెన్షన్ స్కీం ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్.. పెన్షన్ 15వేలు అయ్యే ఛాన్స్
x
Highlights

EPS 95 Pension: ఎంతోకాలంగా ఈపీఎస్ పెన్షన్ స్కీం పెన్షన్ దారులు ఎదురుచూస్తున్న హయ్యర్ పెన్షన్ గురించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుని...

EPS 95 Pension: ఎంతోకాలంగా ఈపీఎస్ పెన్షన్ స్కీం పెన్షన్ దారులు ఎదురుచూస్తున్న హయ్యర్ పెన్షన్ గురించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుని ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అయ్యర్ పెన్షన్ కు సంబంధించిన అప్లై చేసుకోమని ప్రత్యేక పోర్టల్ కూడా పెన్షన్ దారుల ఉద్యోగుల కోసం తెరిచింది. ఇప్పటికే లక్షలాదిమంది పెన్షన్ దారులు హైయర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరి ఇది ఎప్పటినుంచి అమలు అవుతుందనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈపీఎస్ 1995 కింద కనీస పెన్షన్ పెంచాలని అభ్యర్థిస్తూ ట్రేడ్ యూనియన్లతో సహా పలు సంస్థల ప్రతినిధుల నుంచి ప్రాతినిథ్యాలు స్వీకరించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్ కు తెలియజేసింది. లోకసభలో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మినిమం పెన్షన్ ముత్తాన్ని పెంచాలని అభ్యర్థిస్తూ ఉద్యోగుల పెన్షన్ స్కీం 1995 కింద పెన్షన్ల నుండి ప్రభుత్వం ఏమైనా ప్రతిపాదనలు ప్రాతినిధ్యాలు ఏమైనా స్వీకరించారా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఈపీఎస్ 1995 కింద పెన్షన్ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పందించి వివరణ కూడా ఇచ్చారు.

ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో బదులు ఇచ్చారు. ఈపిఎస్ కనీసం పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కోరుతూ కార్మిక సంఘాలతో సహా పలువురు స్టేట్ హోల్డర్స్ నుంచి కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు రిప్రజెంటేషన్ అందినట్లు చెప్పారు.

ఈపీఎస్ 95 కింద పెన్షన్ పెంపు జరపడానికి ఆర్థిక వనరులను సమకూర్చేందుకు కేంద్ర పరిశీలిస్తుందా? అని ఓవైసీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం 2014లో తొలిసారిగా 95 ఏపీఎస్ కింద పెన్షన్లు నెలకు 1000 నుంచి కని కనీస పెన్షన్ చేసిందని బడ్జెట్లో 1.16% నిధులు కేటాయించి వేతనాలు అదనంగా అందించమని తెలిపారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కి ప్రతి సంవత్సరం ఈపీఎస్ కొంత నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు .

అయితే ఈపీఎస్ పెన్షన్ పొందాలంటే కనీసం పది సంవత్సరాల సర్వీస్ ఉండాలి. పెన్షన్ అర్హత కోసం 58 ఏళ్లు వయసు రిటైర్మెంట్ వయస్సు నిర్ణయించారు. 58 సంవత్సరాలు పూర్తికాకముందే ఉద్యోగం నిలిపివేసినట్లయితే ఆ సభ్యుడు ముందస్తు పెన్షన్ కోసం ఎంచుకోవచ్చు. 58 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ప్రతి సంవత్సరానికి నాలుగు శాతం చొప్పున పెన్షన్ తగ్గింపు లోబడి 50 సంవత్సరాల వయసు పూర్తయిన తర్వాత మాత్రమే అటువంటి ముందస్తు పెన్షన్ పొందవచ్చు.

ఇది ఇలా ఉంటే అయ్యర్ పెన్షన్ కోసం ఇప్పటికే 17 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఇటీవల పార్లమెంటులో కేంద్ర మంత్రి తెలిపారు. కాగా హయ్యర్ పెన్షన్ పై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సంవత్సరం బడ్జెట్లో దీనిపై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories