Bank of Baroda: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కస్టమర్లకు శుభవార్త.. వీటికి సంబంధించి మరింత ప్రయోజనం..!

Good News For Bank of Baroda Customers Fixed Deposit Interest Rates Increase
x

Bank of Baroda: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కస్టమర్లకు శుభవార్త.. వీటికి సంబంధించి మరింత ప్రయోజనం..!

Highlights

Bank of Baroda: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కస్టమర్లకు ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకు వడ్డీరేట్లను పెంచింది.

Bank of Baroda: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కస్టమర్లకు ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకు వడ్డీరేట్లను పెంచింది. ఇదివరకు చేసిన డిపాజిట్లపై కొత్తగా చేసే డిపాజిట్లకు రెండింటికి వర్తిస్తుంది.ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు పెంచింది. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే కస్టమర్లకు ఇది అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ నుంచి అందిన సమాచారం ప్రకారం కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 9 నుంచి అమలులోకి వచ్చాయి.

బ్యాంకు కంపెనీ చీఫ్‌ జనరల్‌ మాట్లాడుతూ.. కస్టమర్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందజేస్తున్నామని, తద్వారా అధిక రాబడుల ప్రయోజనాన్ని పొందవచ్చని చీఫ్ జనరల్ మేనేజర్ తెలిపారు. సాధారణ కస్టమర్లు, సీనియర్ సిటిజన్లు 2 నుంచి 3 సంవత్సరాల పెట్టుబడులపై అధిక వడ్డీ ప్రయోజనం పొందుతారు. సీనియర్ సిటిజన్లు 7.75 శాతం వరకు వడ్డీ ప్రయోజనం పొందుతారని తెలిపారు.

త్రివర్ణ ప్లస్ వడ్డీ రేట్లలో కూడా మార్పులు

బ్యాంక్ తన త్రివర్ణ ప్లస్ డిపాజిట్ పథకంపై వడ్డీ రేట్లను 399 రోజుల పాటు మార్చింది. సీనియర్ సిటిజన్లకు వార్షికంగా 7.65 శాతం, సాధారణ పౌరులకు 7.15 శాతం వడ్డీ లభిస్తుంది.

సాధారణ ప్రజల వడ్డీ రేట్లు

>> 15 రోజుల నుంచి 45 రోజులు - 3.5 శాతం

>> 46 రోజుల నుంచి 90 రోజులు - 5 శాతం

>> 91 రోజుల నుంచి 180 రోజులు - 5 శాతం

>> 181 రోజుల నుంచి 210 రోజులు - 5.5 శాతం

>> 211 రోజుల నుంచి 270 రోజులు - 6 శాతం

>> 271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ - 6.25 శాతం

>> 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే ఎక్కువ - 7.25 శాతం

>> బరోడా ట్రైకలర్ ప్లస్ - 399 రోజులు - 7.15 శాతం

సీనియర్ సిటిజన్ల వడ్డీ రేట్లు

>> 15 రోజుల నుంచి 45 రోజులు - 4 శాతం

>> 46 రోజుల నుంచి 90 రోజులు - 5.5 శాతం

>> 91 రోజుల నుంచి 180 రోజులు - 5.5 శాతం

>> 181 రోజుల నుంచి 210 రోజులు - 6 శాతం

>> 211 రోజుల నుంచి 270 రోజులు - 6.5 శాతం

>> 271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ - 6.75 శాతం

>> 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే ఎక్కువ - 7.75 శాతం

>> బరోడా ట్రైకలర్ ప్లస్ - 399 రోజులు - 7.65 శాతం

Show Full Article
Print Article
Next Story
More Stories