విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఛార్జీలు తగ్గుతున్నాయి.. ఎందుకంటే..?

Good News for Air Travelers Fares are Going Down | Business News
x

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఛార్జీలు తగ్గుతున్నాయి.. ఎందుకంటే..?

Highlights

Air Travelers: మీరు తరచుగా విమాన ప్రయాణం చేస్తుంటే ఈ వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది...

Air Travelers: మీరు తరచుగా విమాన ప్రయాణం చేస్తుంటే ఈ వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. రానున్న రోజుల్లో విమాన టిక్కెట్ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమానాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు విమానాల సంఖ్య కూడా పెరగవచ్చని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. విమానాల సంఖ్య పెంపు ప్రభావం ప్రయాణికుల ఛార్జీలపైనా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా ఛార్జీలు 40 నుంచి 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.

వాస్తవానికి రెండేళ్ల క్రితం కరోనా కేసుల పెరుగుదల కారణంగా భద్రత దృష్ట్యా అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. విమానయాన సంస్థలు విమానాలను పెంచే ఆలోచనలో ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం లుఫ్తాన్స, గ్రూప్ క్యారియర్ స్విస్ రాబోయే కాలంలో విమానాల సంఖ్యను రెట్టింపు చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. అదే సమయంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానాలను 17% పెంచే ఆలోచనలో ఉంది. దేశీయ క్యారియర్ ఇండిగో రాబోయే నెలల్లో 100 గ్లోబల్ విమానాలను ప్రారంభించాలని యోచిస్తోంది.

ఇవన్నీ విమాన ఛార్జీలపై ప్రభావం చూపడం ఖాయం. వాస్తవానికి దేశంలో సాధారణ అంతర్జాతీయ విమానాలపై నిషేధం ఉన్న సమయంలో కొన్ని దేశాలతో ఎయిర్ బబుల్ సిస్టమ్ కింద పరిమిత విదేశీ విమానాలను నడపడానికి విమానయాన సంస్థలు అనుమతించాయి. దీని కారణంగా, భారతదేశం-యుఎస్‌తో సహా కొన్ని ముఖ్యమైన విమాన మార్గాలలో ఛార్జీలు గతంలో కంటే 100 శాతం పెరిగాయి. అంతర్జాతీయ విమానాలు తక్కువ ఫ్రీక్వెన్సీ కారణంగా ఎక్కువ డిమాండ్ తక్కువ సరఫరా సంక్షోభం ఏర్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories