Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ధర ఎంత ఉందంటే..?

Gold Rate Today in Hyderabad 14th January 2025
x

Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ధర ఎంత ఉందంటే..?

Highlights

Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది.

Gold Rate Today: సంక్రాంతి వేళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ ఏడాది మొదటి నుంచి బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. జనవరి 14న బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో చాలా మంది బంగారంలోని పెట్టుబడులకు ఈ క్వీటీలకు మళ్లిస్తున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే మంగళవారం బంగారం ధర తగ్గింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగుళూరు, ముంబై ప్రాంతాల్లో తులం బంగారం ధరలు 22 క్యారెట్లు రూ.73,300 ఉండగా.. 24 క్యారెట్స్ బంగారం రూ.79,960 ఉంది. సోమవారం ధరలతో పోలిస్తే.. ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్స్ రూ.100, 24 క్యారెట్స్ రూ.110 చొప్పున తగ్గింది

చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,300 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 79,960 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 73,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.110 తగ్గి రూ.80,110 వద్దకు చేరింది.

బంగారం ధరలతో పాటు వెండి ధరల్లోనూ మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు కేజీ వెండి రేటు రూ.2000 తగ్గి, రూ.1,00,000 వద్దకు చేరింది.

మరో వారం రోజుల్లో అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం జరగనుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం పసిడి ధరలు మరింతగా పెరిగే సూచనలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి సహా విలువైన లోహాల ధరలు మారడానికి ప్రపంచ రాజకీయాల అనిస్థితి, ద్రవ్యోల్బనం, విదేశీ మారకపు విలువ సహా చాలా అంశాలు తోడ్పడతాయి.ప్రపంచంలోనే అత్యధిక బంగారం దిగుబడి చేసుకునే దేశాలలో భారత్ ఒకటి.

Show Full Article
Print Article
Next Story
More Stories