Gold rate: భారీగా పెరిగిన బంగారం.. చుక్కలనంటిన వెండి ధరలు!

gold rate this week review
x
gold rate
Highlights

బంగారం భారతీయులకు ఎంతో ఇష్టమైన లోహం. బంగారు ఆభరణాలు ధరించడం.. బంగారంతో చేసిన వస్తువులను వాడటం అంటే అమితమైన ఆసక్తి మనకు. పెళ్లిళ్లలో బంగారానికి ఇచ్చే...

బంగారం భారతీయులకు ఎంతో ఇష్టమైన లోహం. బంగారు ఆభరణాలు ధరించడం.. బంగారంతో చేసిన వస్తువులను వాడటం అంటే అమితమైన ఆసక్తి మనకు. పెళ్లిళ్లలో బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత చెప్పలేనిది. వధువుకు ఎంత బంగారం పుట్టింటి వారిస్తారు.. ఎంత బంగారం అత్తింటి వారు పెడతారు వంటి లెక్కలు అన్ని పెళ్ళిళ్ళలోనూ ప్రధాన చర్చనీయాంశాలలో ఒకటిగా ఉంటుంది. ఇక బంగారం ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి మంచి మార్గంగా ఎక్కువ శాతం భావిస్తున్నారు. అటువంటి పసిడికి సంబంధించి ధరలు ఎలా ఉంటున్నాయనేది తెలుసుకోవాలనే ఆసక్తీ చాలా మందిలో ఉంటుంది.

ఇక బంగారం ధరలు, వెండి ధరలు రోజు రోజూ మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పులు నిత్యం జరుగుతుంటాయి. సోమవారం నుంచి శనివారం వరకూ బంగారం మార్కెట్ ధరలు అటూ ఇటూ మారుతూ వస్తాయి. ఆదివారం ట్రేడింగ్ ఉండదు. కొద్దిపాటి మార్పులతో శనివారం సాయంత్రం ఉన్న ముగింపు ధరకే బంగారం అమ్మకాలు జరుగుతాయి.

ఇక గత సోమవారం(జూలై 20) నుంచి శనివారం(జూలై 25) వరకూ బంగారం ధరల్లో చోటు చేసుకున్న మార్పులు.. చేర్పులపై విశ్లేషణ.

పసిడి పరుగులు!

సోమవారం (20 జూలై) పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 47,040 రూపాయలుగానూ, 24 క్యారెట్ల బంగారం 51,330 రూపాయలుగానూ మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. ఆ ఒక్కరోజూ 90 రూపాయల తగ్గుదల చూపించిన బంగారం ధరలు మంగళవారం (21 జూలై) నుంచి వారంతం వరకూ పెరుగుతూనే వచ్చాయి. శనివారం (25 జూలై) సాయంత్రం 22 క్యారెట్ల బంగారం 49,040 రూపాయలుగానూ, 24 క్యారెట్ల బంగారం 53,470 రూపాయలుగానూ ముగిసాయి. అంటే వారం రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 1,190 రూపాయలు పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా 1,270 రూపాయలు పైకెగసింది.

రికార్డు స్థాయిలో వారం రోజులు పెరుగుదల చూపించింది. ఈ వారంలో చూసుకుంటే జూలై 23వ తేదీ గరిష్టంగా 830 రూపాయలకు పైగా పెరిగింది. శ్రావణ మాసం కావడం.. అంతర్జాతీయంగా పెరుగుతున్న బంగారం ధరలు దేశీయంగానూ బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. ఆ ప్రభావం హైదరాబాద్ మార్కెట్ మీద కూడా పడింది. కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో.. మదుపరులు కూడా బంగారం పై పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుండడం కూడా బంగారం ధరలు ఆకాశాన్ని తాకడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.

అంబరాన్ని తాకిన వెండి ధరలు!

ఇక దేశీయంగా వెండి ధరలు మాత్రం భారీగా పెరిగిపోయాయి. జూలై 20 సోమవారం కేజీ వెండి ధర 52,910రూపాయలు. వారాంతానికి వచ్చేసరికి 61,200 రూపాయలకు చేరుకుంది. మధ్యలో జూలై 23 వ తేదీన ఒక్కసారిగా 3550 రూపాయలు రికార్డు పెరుగుదల నమోదు చేసి 62,000 రూపాయలకు చేరుకుంది. ఇక తరువాత నామ మాత్రంగా తగ్గినా..శనివారం సాయంత్రానికి 61,200 వద్ద కేజీ వెండి ధరలు నిలిచాయి.

ఇక శ్రావణ మాసం కావడంతో రాబోయే వారంలోనూ బంగారం ధరలు దిగివచ్చే అవకాశం లేదని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories