Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు..నేటి పసిడి ధర ఎలా ఉందంటే?

Gold Rate Today 21st septembar 2024 Saturday check price details
x

 Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు..నేటి పసిడి ధర ఎలా ఉందంటే?

Highlights

Gold Rate Today: నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర ఏకంగా 500 రూపాయలు పెరిగింది. బంగారం ధర మరోసారి 75 వేల రూపాయలు దాటింది. నేటి పసిడి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 75,120గా ఉంది. అలాగే 22 క్యారట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 68,860గా ఉంది.

బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కారణంగా చెప్పవచ్చు. బంగారం ధరలు నేడు అమెరికాలో ఒక ఔన్సుకు 2647 డాలర్ల వద్ద ఉంది. గత మూడు రోజుల్లో బంగారం ధర అమెరికాలో 150 డాలర్లు పెరిగింది. దీనికి తోడు ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లు తగ్గించడంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడం ప్రారంభించాయి.

అమెరికా ట్రెజరీ బాండ్లపై ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్ మెంట్ బంగారం వైపు తరలిస్తున్నారు. దీంతో బంగారం డిమాండ్ పెరిగింది ఫలితంగా పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. బంగారం ధరలు భారీగా పెరగడం వెనక అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులతో పాటు దేశీయంగా కూడా బంగారానికి డిమాండ్ పెరుగుతుంది .

ఫలితంగా పసిడి ధరలు మరోసారి 75 వేల మార్కును దాటేశాయి. పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో అటు ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఆభరణాల దుకాణాదారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు దసరా, దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా మన దేశంలో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసే ఆనవాయితీ ఉంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇది తమ సేల్స్ ను ప్రభావితం చేస్తుందని జువెలరీ షాపుల వారు చెప్తున్నారు. ఇదిలా ఉంటే బంగారం ధర భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని. ఈ ఏడాది చివరి నాటికి 90000 రూపాయలకు వెళ్లే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories