Gold Rate Today: తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..?

Gold Rate Today 13th December 2024
x

Gold Rate Today: తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..?

Highlights

Gold Rate Today: ఇటీవల తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి.

Gold Rate Today: ఇటీవల తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. గోల్డ్ లవర్స్‌కి షాక్ ఇస్తూ.. వరుసగా మూడు రోజులు పెరిగాయి. దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 79,460కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 79,470గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి.. రూ. 7,94,600గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 72,840కి చేరింది. గురువారం ఈ ధర రూ. 72,850గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 7,28,400కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 7,284గా కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 72,990గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,610గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 72,840 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 79,460గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories