Gold rate: ఈ వారం పైకెగసిన బంగారం ధరలు..భారీగా పెరిగిన వెండి!

Gold rate: ఈ వారం పైకెగసిన బంగారం ధరలు..భారీగా పెరిగిన వెండి!
x
Highlights

Gold Rate: వారమంతా బంగారం, వెండి ధరలు కొద్దిగా కిందికి..మరింత పైకి అన్నట్లు కదిలాయి. వెండి మాత్రం ఒకేసారి పెరుగుదల నమోదు చేసి అదే ట్రెండ్ కొనసాగించింది. దీంతో వారాంతానికి బంగారం ఓ మోస్తరుగా పెరుగుదల నమోదు చేయగా , వెండి ధరలు భారీ పెరుగుదలను నమోదు చేశాయి.

బంగారం భారతీయులకు ఎంతో ఇష్టమైన లోహం. బంగారు ఆభరణాలు ధరించడం.. బంగారంతో చేసిన వస్తువులను వాడటం అంటే అమితమైన ఆసక్తి మనకు. పెళ్లిళ్లలో బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత చెప్పలేనిది. వధువుకు ఎంత బంగారం పుట్టింటి వారిస్తారు.. ఎంత బంగారం అత్తింటి వారు పెడతారు వంటి లెక్కలు అన్ని పెళ్ళిళ్ళలోనూ ప్రధాన చర్చనీయాంశాలలో ఒకటిగా ఉంటుంది. ఇక బంగారం ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి మంచి మార్గంగా ఎక్కువ శాతం భావిస్తున్నారు. అటువంటి పసిడికి సంబంధించి ధరలు ఎలా ఉంటున్నాయనేది తెలుసుకోవాలనే ఆసక్తీ చాలా మందిలో ఉంటుంది. ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎంత తగ్గింది.. ఎంత పెరిగింది చూడడం సహజం..పదుల రూపాయల్లో పెరిగినా తరిగినా పెద్దగా ప్రజలు పట్టించుకోరు. కానీ, బంగారం విషయంలో మాత్రం రూపాయి తగ్గినా..రూపాయి పెరిగినా అది పెద్ద విషయంలానే లేక్కేస్తారు.

ఇక బంగారం ధరలు, వెండి ధరలు రోజు రోజూ మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పులు నిత్యం జరుగుతుంటాయి. సోమవారం నుంచి శనివారం వరకూ బంగారం మార్కెట్ ధరలు అటూ ఇటూ మారుతూ వస్తాయి. ఆదివారం ట్రేడింగ్ ఉండదు. కొద్దిపాటి మార్పులతో శనివారం సాయంత్రం ఉన్న ముగింపు ధరకే బంగారం అమ్మకాలు జరుగుతాయి.

ఇక గత సోమవారం(అక్టోబర్ 05) నుంచి శనివారం(అక్టోబర్ 11) వరకూ బంగారం ధరల్లో చోటు చేసుకున్న మార్పులు.. చేర్పులపై విశ్లేషణ.

వారం అంతా పైకీ కిందికీ కదిలిన బంగారం!

గత వారంలో (అక్టోబర్ 04 నుంచి అక్టోబర్ 10 వరకు) బంగారం ధరలు అటూ ఇటూ కదులుతూనే వచ్చాయి. సోమవారం తగ్గుదల కనబరిచిన బంగారం ధరలు తరువాతి రోజు అదేస్థాయిలో పెరుగుదల కనబరిచాయి. ఇలా వారం అంత పెరుగుతూ, తగ్గుతూ పసిడి ధరలు నడిచి వారాంతానికి కూడా పెరుగుదలతో నిలిచాయి. మొత్తమ్మీద చూసుకుంటే గత వారంకంటె ఈ వారాంతానికి బంగారం ధరలు కొద్ది మొత్తంలో పెరిగాయి.

అయితే, గత వారంతంలో పసిడి ధరల కింది చూపులు ఈ వారం కొనసాగలేదు. అక్టోబర్ 05వతేదీ సోమవారం పది గ్రాములకు 490 రూపాయలు తగ్గిన బంగారం ధరలు తరువాతి రోజూ అంటే మంగళవారం (అక్టోబర్ 06) 430 రూపాయలు పైకెగసింది. బుధవారం (అక్టోబర్ 07) దాదాపుగా మున్డురోజులనే 400 రూపాయలు తగ్గింది. తరువాతి రోజు (అక్టోబర్ 08)న 50 రూపాయలు తగ్గాయి. ఇక అటు తరువాత రోజు(అక్టోబర్ 09) 420 రూపాయలు పెరిగాయి. మళ్ళీ శనివారం బంగారం ధరలు మళ్ళీ కిందకు దిగి వచ్చాయి. చివరకు శనివారం అక్టోబర్ 10న 390 రూపాయల పెరుగుదలతో వారాన్ని ముగించింది పసిడి. వారం మొత్తంగా చూసుకుంటే సోమవారం(అక్టోబర్ 05) 22 కారెట్ల బంగారం పది గ్రాములకు 48,510 రూపాయల వద్ద మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. శనివారం(అక్టోబర్ 10) సాయంత్రం 48,820 రూపాయల వద్ద ముగిశాయి. అంటే 310 రూపాయల పెరుగుదల కనబరిచింది. ఇక 24 కారెట్ల బంగారం సోమవారం(అక్టోబర్ 05)న పది గ్రాములకు 52,910 రూపాయల వద్ద మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. శనివారం (అక్టోబర్ 10) సాయంత్రం 53,250 రూపాయల వద్ద ముగిశాయి. అంటే వారం మొత్తం చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం దాదాపు 340 రూపాయల పెరుగుదల కనబరిచింది.

ఇక ప్రస్తుతం శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోయినా.. దసరా పండుగ వస్తుండడం.. అంతర్జాతీయంగా ధరలు కూడా పైముఖం పట్టడంతో పసిడి కాస్త పైకి కదిలినట్టు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వెండి ధరలు షాక్!!

ఇక దేశీయంగా వెండి ధరలు ఈవారం పైకెగశాయి. వారం పొడవునా వెండి ధరలు పెరుగుతూనే వచ్చాయి. ఒక్క సోమవారం, బుధవారం మాత్రం కాస్త తగ్గుదల నమోదు చేశాయి. . వారం ప్రారంభంలో సోమవారం(అక్టోబర్ 05) కేజీ వెండి 61,200 రూపాయల వద్ద ప్రారంభం అయింది. ఆ రోజు కేజే వెండి ధర 510 రూపాయలు తగ్గింది. అటు తరువాతి రోజు అంటే మంగళవారం(అక్టోబర్ 06) వెండి ధరలు షాకిచ్చాయి. ఏకంగా కేజీకి 1300 రూపాయల పెరుగుదల చూపించాయి. ఇక ఆ మర్నాడు (అక్టోబర్ 07) ఒక్కసారిగా కిందికి పడిపోయింది. కేజీకి 1800 తగ్గింది. మళ్ళీ అక్టోబర్ 08వతేదీ గురువారం 800 రూపాయలు పెరిగింది. ఆ మర్నాడు అక్టోబర్ 09న 400 రూపాయలు పెరిగింది. ఇక శనివారం మళ్ళీ ఒక్కసారిగా కేజీ వెండి 1500 రూపాయల భారీ పెరుగుదల తో వారం ముగిశాయి. ఇలా వారం అంతా వెండి ధరలు పెరుగుదల నమోదు చేస్తూ వచ్చాయి. మొత్తమ్మీద వారాంతానికి 61,200 రూపాయల నుంచి 62,910 స్థాయికి వెండి ధరలుపైకేగాశాయి. అంటే ఒక్క వారంలో కేజే వెండి 1710 రూపాయలు పెరిగింది.

ఇక ప్రస్తుతం శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోయినా.. దసరా పండుగ వస్తుండడంతొ రానున్న వారంలోనూ బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులు చోటు చేసుకోక పోవచ్చనీ.. కొద్దిపాటి పెరుగుదల నమోదు చేసే అవకాశం ఉందనీ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి!

Show Full Article
Print Article
Next Story
More Stories