Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర

Gold Price Today September 3, 2024 today gold prices in Hyderabad are as follows
x

Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర

Highlights

Gold Price Today: సెప్టెంబర్ 3 మంగళవారం బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. గత వారం రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు భారీగా పతనం అయ్యాయి. దేశీయంగా శ్రావణమాసం ముగిసిన సందర్భంగా బంగారు నగలకు డిమాండ్ తగ్గింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

Gold Price Today: సెప్టెంబర్ 3 మంగళవారం బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. గత వారం రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు భారీగా పతనం అయ్యాయి. దేశీయంగా శ్రావణమాసం ముగిసిన సందర్భంగా బంగారు నగలకు డిమాండ్ తగ్గింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో మనదేశంలో కూడా ఈరోజు బంగారం ధరలు తగ్గి వస్తున్నాయి. గత నెలలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు జరిగాయి. ఆ సమయంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం శ్రావణమాసం ముగియడంతో పెళ్లిల్ల సీజన్ ముగిసింది. దీంతో బంగారం గత మూడు సెషన్లుగా తగ్గు ముఖం పడుతూ వచ్చింది. ఇప్పుడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఔన్స్ బంగారం ధర 2500 డాలర్ల కన్నా తక్కువ ధరకు లభ్యం అవుతోంది. దీంతో బంగారం ధర తగ్గుముఖం పట్టింది. గతంలో బంగారం ధర 2550 డాలర్ల ఎగువన ట్రేడ్ అయింది. ఇక దేశీయంగా బంగారం ధరలు గమనిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,770 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,700 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. గత మూడు సెషన్లుగా బంగారం ధర 450 రూపాయలు తగ్గింది. అదే సమయంలో నేడు బంగారం అత్యధికంగా 250 రూపాయలు తగ్గడం విశేషం.

ఇదిలా ఉంటే బంగారం ధరలు సెప్టెంబర్ నెలలో భారీగా పెరిగే అవకాశం ఉందని గడచిన కొన్ని రోజులుగా అంచనాలు వెలువడుతున్నాయి. ఎందుకు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నెలలోనే అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక భేటీ జరగనుంది. ఇందులో వడ్డీ రేట్లు పావు శాతం మీద తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో బంగారం ధరలు భగ్గున పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories