Gold Rate: దేశీయ మార్కెట్లో బంగారం ధర పరుగులు

Gold Price increasing In Indian Markets-05-04-2021
x

గోల్డ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Gold Rate: కరోనా ప్రకంపనల నడుమ లాక్ డౌన్ భయాందోళనలు * ప్రత్యామ్నాయ పెట్టుబడులుగా పసిడి వైపు మదుపర్లు

Gold Rate: దేశీయ మార్కెట్లో విలువైన లోహం పుత్తడి ధర పరుగులు పెడుతోంది. కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనల నడుమ లాక్ డౌన్ భయాందోళనలు పెరిగిపోతున్న నేపధ్యంలో మదుపర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడులుగా పసిడి వైపు దృష్టి పెడ్తున్నారు. దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ లో ఎల్లో మెటల్ ధర గత పది రోజుల వ్యవధిలో 1100 రూపాయల మేర తగ్గగా 1700 రూపాయల వరకు పెరిగింది. ఆదివారం రోజు నిలకడగా వున్న ఎల్లోమెటల్ తాజావారం తొలిరోజున తిరిగి దూకుడు కొనసాగిస్తోంది.

రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు 44,410 రూపాయల వద్దకు చేరగా ఆర్దిక రాజధాని ముంబైలో 43,910 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ , విశాఖల్లో 22 క్యారెట్ల ధర 42,270 గా నమోదు కాగా 24 క్యారెట్ల ధర 46,110 రూపాయల వద్దకు చేరింది. మరోవైపు కేజీ వెండి ధర స్వల్పంగా తగ్గి 65 వేల 010 రూపాయల వద్ద కొనసాగుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories