Gold Rate: గతవారం రోజులుగా బులియన్ మార్కెట్లలో తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి రేట్లు
Gold Rate: ఆకాశాన్నంటిన బంగారం ధరలు క్రమేపీ దిగివస్తున్నాయి. గతవారం రోజులుగా బులియన్ మార్కెట్లలో తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మరింత క్షీణించాయి. ఆల్-టైమ్ హై నుండి 12వేల రూపాయల మేర పతనం కావడం గమనార్హం. వెండి ధర కూడా భారీ పతనాన్నినమోదు చేసింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన రేట్ల ప్రకారం స్పాట్ మార్కెట్‌లో ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 44వేల 422 రూపాయలుగా ఉంది. వెండి కిలో ఏకంగా 1360 రూపాయలు తగ్గి 64వేల766 స్థాయికి చేరింది.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర 41వేల450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 45వేల 220కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 41వేల 810 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 45వేల 610 రూపాయలకు చేరింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 44వేల 430 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర 43వేల 430పలుకుతోంది. కాగా 2020, ఆగస్టులో 10గ్రాముల పసిడి ధర 57వేల 008గా నమోదయ్యింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire