ఆరు నెలల్లో భారీగా పెరిగిన బంగారం దిగుమతులు.. భారతీయుల ఇళ్లలో బంగారం ఎంతుందంటే?

Gold Imports Increased Significantly in Six Months
x

ఆరు నెలల్లో భారీగా పెరిగిన బంగారం దిగుమతులు.. భారతీయుల ఇళ్లలో బంగారం ఎంతుందంటే?

Highlights

బంగారం దిగుమతులు 2024-25 ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 21.78 శాతం పెరిగాయి.

బంగారం దిగుమతులు 2024-25 ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 21.78 శాతం పెరిగాయి. దీని విలువ 27 బిలియన్ డాలర్లు. 2023-24 ఆర్ధిక సంవత్సరం రెండు త్రైమాసికాల్లో కేవలం 22.25 బిలియన్ డాలర్ల బంగారం దిగుమతుల జరిగాయి. బంగారంపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం 15 నుంచి 6 శాతానికి తగ్గించింది. ఇది కూడా బంగారం కొనుగోళ్లు పెరగడానికి కారణమనే విశ్లేషణలున్నాయి.

బంగారం కొనుగోళ్ల పెరగడానికి కారణం ఏంటి?

దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలు కూడా బంగారం కొనుగోళ్లు పెరగడానికి కారణమయ్యాయి. మరో వైపు పెళ్లిళ్లు, ఫంక్షన్ల సమయాల్లో కూడా బంగారం కొనుగోలుకు భారతీయులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. 2023-24 లో భారత్ మొత్తం బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇండియాకు ప్రధానంగా స్విట్జర్లాండ్ నుండి బంగారం దిగుమతి అయింది. గత ఆర్ధిక సంవత్సరం దిగుమతి చేసుకున్న బంగారంలో 40 శాతం ఇక్కడి నుంచే. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ యూఏఈ నుంచి 16 శాతం, దక్షిణాఫ్రికా 10 శాతంతో వరుస స్థానాల్లో నిలిచాయి.

భారతీయుల ఇళ్లలో 28 వేల టన్నుల బంగారం

భారతీయుల ఇళ్లలో 28 వేల టన్నుల బంగారం నిల్వ ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక తెలిపింది. అయితే ఇందులో ఎక్కువగా నగల రూపంలోనే ఉంది. అవకాశం వస్తే బంగారం కొనుగోలు చేసేందుకు భారతీయులు ఆసక్తి చూపుతారు. అమెరికా, చైనాలలో ఇళ్లలో 24 వేల టన్నుల చొప్పున బంగారం ఉందని ఈ నివేదిక వివరించింది.

ఆర్ బీ ఐ వద్ద 855 టన్నుల బంగారం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు భారీగా పెరిగాయి. 2024 మార్చి నుంచి సెప్టెంబర్ వరకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్ మెంట్స్ నుంచి 102 టన్నుల బంగారాన్ని ఇండియా బదిలీ చేసుకుంది. దీంతో బంగారం నిల్వలు 855 మెట్రిక్ టన్నులకు చేరాయని ఆర్ బీ ఐ నివేదిక తెలిపింది. స్వదేశంలో 510.5 టన్నులు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్ మెంట్స్ వద్ద 324 టన్నుల చొప్పున నిల్వ ఉంది. 20.26 టన్నుల బంగారం డిపాజిట్ల రూపంలో తమ వద్ద ఉందని ఆర్ బీ ఐ తెలిపింది. 2024 మార్చి ముగింపు నాటికి విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా 8.15 శాతం. సెప్టెంబర్ చివరినాటికి ఇది 9.32 శాతానికి పెరిగింది.

భారత్ ఆర్ధికపరిస్థితి

దేశంలోకి బంగారం దిగుమతులు పెరగడం వల్ల భారతదేశ వాణిజ్య లోటు ఈ ఆర్ధిక సంవత్సరం ఆర్ధ భాగంలో 137.44 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఇదే కాలంలో ఇది 119.24 డాలర్ల వద్ద ఉంది. 2024 ఏప్రిల్ -సెప్టెంబర్ మధ్యలో ఆభరణాల ఎగుమతులు 10.89 శాతం తగ్గి 13.91 బిలియన్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్యలోటు 9.7 బిలియన్లకు పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో వెండి దిగుమతులు కూడా 376.41 శాతం పెరిగి 2.3 బిలియన్లకు చేరాయి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2023-24 $480.65 మిలియన్ వెండి దిగుమతులు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories