Dhanatrayodashi Sale: లాభాలు కురిపించిన ధనత్రయోదశి.. రూ.25,000 కోట్ల బులియన్ విక్రయాలు

Gold And Silver Shops Crowded With Buyers
x

Dhanatrayodashi Sale: లాభాలు కురిపించిన ధనత్రయోదశి.. రూ.25,000 కోట్ల బులియన్ విక్రయాలు 

Highlights

Dhanatrayodashi Sale: కొనుగోలుదారులతో కిటకిటలాడిన బంగారం దుకాణాలు

Dhanatrayodashi Sale: ధనత్రయోదశి లాభాల వర్షం కురిపించింది. బులియన్ మార్కెట్‌తో పాటు అన్ని వ్యాపార రంగాలు రాణించాయి. ధన త్రయోదశి శని, ఆదివారాలు రావడం మరింత కలిసి వచ్చింది. దేశ వ్యాప్తంగా రెండు రోజుల్లో 25వేల కోట్ల రూపాయల నగల వ్యాపారం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆదివారం సాయంత్రం నుంచి బంగారం దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. గత ఏడాది ధన త్రయోదశితో పోలిస్తే ఈసారి బంగారం, వెండి, నగల అమ్మకాలు 35శాతం వరకు పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

గత సంవత్సరం ధన త్రయోదశి రోజు పది గ్రాముల మేలిమి బంగారం 47వేల 644 రూపాయలు ఉంటే... ఈ ఏడాది 52వేలకు ఎగబాకింది. బంగారం ధరలు పెరిగినా కొనుగోలుదారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పట్టణ ప్రాంతాల్లోని వారు ఆన్‌లైన్‌లో ముందుగానే బుక్ చేసుకుని మరీ ధన త్రయోదశి కొనుగోళ్లు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధంతేరస్ బులియన్ అమ్మకాలు 15 శాతం నుంచి 25శాతం పెరిగి ఉంటాయని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories