Gold Rate Today: మహిళలకు బంగారం లాంటి వార్త..మళ్లీ తగ్గిన పసిడి ధరలు ..తులం ఎంత దిగొచ్చిందంటే?

Gold Rate Today 29th September 2024 gold price in Hyderabad and delhi full details here
x

Gold Rate Today: పెరిగిన బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?

Highlights

Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే నేడు బంగారం ధరలు తగ్గాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన...

Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే నేడు బంగారం ధరలు తగ్గాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన క్రమంలో గోల్డ్ ధరలు భారీగా దిగివస్తున్నాయి. క్రితం రోజు కాస్త రేట్లు పెరిగినట్లు కనిపించిన మళ్లీ తగ్గడం ఊరట కల్పించే విషమని చెప్పవచ్చు. ఈ క్రమంలో హైదరాబాద్ తోపాటు ఢిల్లీ మార్కెట్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మనదేశంలో ప్రతి సంవత్సరం టన్నుల కొద్ది బంగారం దిగుమతి అవుతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా గోల్డ్ దిగుమతి చేసుకుంటున్న రెండో దేశంలో భారత్ ముందు వరుసలో నిలుస్తోంది. అంతలా భారతీయులకు బంగారం చాలా ఇష్టం. పండగలు, శుభకార్యాలు వేడుకల్లో బంగారం కచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు ఆభరణాలుగా ధరిస్తుంటారు. ఇక పండగల సీజన్ లో బంగారానికి ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది.

అయితే గతకొద్ది రోజులుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఎన్నికైన తెలిసిన తర్వాత బంగారం ధరలు వరుసగా పడిపోతూ వస్తున్నాయి. డాలర్ విలువ పుంజుకుని గోల్డ్ రేట్లు దిగివస్తున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 10వ తేదీన హైదరాబాద్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంలో బంగారం ధరలు క్రితం రోజు పెరిగినా నేడు మళ్లీ రేట్లు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ధరలు ఔన్సుకు 2684 డాలర్ల దగ్గర ఉంది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 31జ32 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. అలాగే భారత రూపాయి మారకం విలువ నేడు రూ. 84.435 దగ్గర అమ్ముడవుతోంది.

హైదరాబాద్ మార్కట్లో బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 100 తగ్గి రూ. 72 వేల 750 దగ్గరకు వచ్చింది. 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ. 110 తగ్గి రూ 79 వేల 360 దగ్గరకు పడిపోయింది. ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గడంతో రూ. 72 వేల 900 దగ్గరకు పడిపోయింది. అలాగే 24క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ.110 దిగివచ్చింది. దీంతో రూ. 79వేల 510 పలుకుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories