Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్..మరోసారి పెరిగిన బంగారం ధర

gold and silver rates today 13th august 2024 in telugu states
x

Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్..మరోసారి పెరిగిన బంగారం ధర

Highlights

Gold Price Today: దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. గత రెండు మూడు రోజులు పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలోని ప్రధాన ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Price Today: గత మూడు నాలుగు నెలలుగా శుభాకార్యాలు లేవు. ఇప్పుడు శ్రావణమాసం ప్రారంభం అవ్వడంతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు షురూ అయ్యాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లను అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బంగారం. అందుకే చాలా మంది బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. బడ్జెట్ 2024 ప్రవేశపెట్టిన సందర్భంగాలో బంగారం ధరపై ట్యాక్స్ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన మరుక్షణమే అనూహ్యంగా ఒక్క రోజు రూ. 4వేలు తగ్గింది.

ఆ తర్వాత తగ్గుతూ వచ్చిన బంగారం ధర..ఇప్పుడు పరుగులు పెడుతుంది. తులంగా ధర 70వేల మార్క్ దాటేసింది. కేంద్ర మంత్రి ప్రకటనతో బంగారం ధరలు మరింత తగ్గుతాయని ఆశించిన వారికి...ఇప్పుడు పెరుగుతున్న ధరలు ఒకింత నిరాశే పరుస్తున్నట్లు చెప్పవచ్చు. ఫ్యూచర్ లో మరింత తగ్గుతుందేమో కొనుగోలు చేయోచ్చు అనుకునేవారికి మాత్రం ఆందోళన కలిగించే విషయం. కాగా నేడు ఆగస్టు 13వ తేదీ దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ విజయవాడలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నా యో ఇప్పుడు చూద్దాం.

దేశంలో బంగారం ధరలు మంగళవారం పెరిగాయి. పది గ్రాముల బంారం ధర రూ. 10 పెరిగి రూ. 64, 710కి చేరుకుంది. సోమవారం ఈ ధర రూ. 64,700గా ఉంది. ఇక వందగ్రాములు 22క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 6,47,100కి చేరుకుంది. ఒక గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 6,471వద్ద కొనసాగుతోంది.

అటు 24క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 70,590 వద్ద ఉంది. సోమవారం ఈ ధర రూ. 70,580గా ఉండేది ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,860గాను.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,740గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం​ ధర రూ. 64,710గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,590గా ఉండగా.. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories