Today Gold Rate : స్వల్పంగా తగ్గిన బంగారం ధర..ఆగస్టు 20, మంగళవారం పసిడి ధరలు ఇవే

Gold and Silver prices today 20th august 2024 hyderabad and delhi 24k gold price check here
x

Today Gold Rate : స్వల్పంగా తగ్గిన బంగారం ధర..ఆగస్టు 20, మంగళవారం పసిడి ధరలు ఇవే

Highlights

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Gold and Silver prices today : దేశంలో మంగళవారం బంగారం, వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ. 66,900కు చేరుకుంది. ఆదివారం ఈ ధర రూ. 66,700గా ఉండేది. వంద గ్రాముల22క్యారెట్ల బంగారం ధర రూ. 100తగ్గింది. ప్రస్తుతం రూ. 6,66900గా ఉంది. గ్రాము బంగారం ధర ప్రస్తుతం 6,669గా ఉంది.

24క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 10 దిగివచ్చింది. రూ. 72,750 వద్ద కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ. 72,770గా ఉంది. వంద గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 100 దిగివచ్చింది. రూ. 7,27,600గా ఉంది. గ్రాము బంగారం ధర రూ. 7,276గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు మంగళవారం స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22క్యారెట్ల బంగారం ధర రూ. 66,840గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 72,910గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,690గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 72,760గా ఉంది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. విశాఖలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

అటు దేశంలో వెండి ధరలు కూడా మంగళవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం వంద గ్రాముల వెండి ధర రూ. 8,580గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ. 100 తగ్గి రూ. 85,800గా కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ. 85,900గా నమోదు అయ్యింది. హైదరాబాద్​లో కిలో వెండి ధర రూ. 90,900 ఉండగా..కోల్​కతాలో రూ.​ 85,900.. బెంగళూరులో రూ. 82,900గా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories