Indian Railways: దేశంలో అత్యంత మురికి, కంపు కొట్టే 10 రైళ్లు ఇవే.. అగ్రస్థానంలో ఏ ట్రైన్ పేరుందో తెలుసా?

From Saharsa-Amritsar Garib Rath ot Shri Mata Vaishno Devi-Bandra Swaraj Express these 10 trains most Dirty and bad smell trains in the country check here full Details
x

Indian Railways: దేశంలో అత్యంత మురికి, కంపు కొట్టే 10 రైళ్లు ఇవే.. అగ్రస్థానంలో ఏ ట్రైన్ పేరుందో తెలుసా?

Highlights

Most Dirty Trains in India: ప్రతిరోజూ వందలాది రైళ్లు దేశ వ్యాప్తంగా తిరుగుతున్నాయి. వీటి నిర్వహణ కోసం భారతీయ రైల్వేలు కూడా చాలా శ్రమిస్తున్నాయి.

Most Dirty Trains in India: ప్రతిరోజూ వందలాది రైళ్లు దేశ వ్యాప్తంగా తిరుగుతున్నాయి. వీటి నిర్వహణ కోసం భారతీయ రైల్వేలు కూడా చాలా శ్రమిస్తున్నాయి. అయినా కొన్ని రైల్లు మాత్రం ఎంతో మురికిగా లేదా కంపు కొడుతూనే ఉంటాయి. ఈ రోజు మనం రైల్వేలో అత్యంత 10 మురికి రైళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాటి గురించి రైల్వేలకు అత్యధిక ఫిర్యాదులు అందుతాయి. రాబోయే రోజుల్లో ఈ రైళ్లలో దేనిలోనైనా ప్రయాణించే ప్లాన్ మీకు కూడా ఉంటే, వాటి గురించి ఓసారి తెలుసుకుంటే మంచిది.

జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రైలు ఏదంటే?

రైల్వేలోని అత్యంత మురికి రైళ్ల గురించి మాట్లాడితే, సహర్స-అమృతసర్ గరీబ్ రథ్ రైలు పేరు ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ రైలు పంజాబ్ నుంచి సహర్సా వరకు వెళుతుంది. ఇప్పటి వరకు ఈ రైలులో అపరిశుభ్రతపై అత్యధిక ఫిర్యాదులు అందాయి.

కోచ్ నుంచి టాయిలెట్ వరకు అంతా మురికిగానే..

ఈ రైలులో కోచ్ నుంచి సింక్, టాయిలెట్ సీట్, క్యాబిన్ వరకు మురికిగానే కనిపిస్తుందంట. ఈ రైలు పేరు అపరిశుభ్రత రైలులో అగ్రస్థానం పొందింది.

అనేక రైళ్లపై ఫిర్యాదులు..

ఇది కాకుండా అపరిశుభ్రతతో నిండిన అనేక రైళ్లు ఉన్నాయి. జోగ్బానీ-ఆనంద్ విహార్ సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు, శ్రీ మాతా వైష్ణో దేవి-బాంద్రా స్వరాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు, బాంద్రా-శ్రీ మాతా వైష్ణో దేవి స్వరాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు, ఫిరోజ్‌పూర్-అగర్తలా త్రిపుర సుందరి ఎక్స్‌ప్రెస్ రైలుతో సహా అనేక ఇతర రైళ్ల పేర్లు కూడా అపరిశుభ్రతలో ముందంజలో ఉన్నాయి. ఈ రైళ్లపై రైల్వేలకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి.

దీంతో పాటు ఆనంద్ విహార్-జోగ్బానీ సీమాంచల్ ఎక్స్‌ప్రెస్, అమృత్‌సర్ క్లోన్ స్పెషల్ ట్రైన్, అజ్మీర్-జమ్ము తావి పూజ ఎక్స్‌ప్రెస్ రైలు, న్యూఢిల్లీ-దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో కూడా అపరిశుభ్రతపై అనేక ఫిర్యాదులు అందాయి. ఈ రైళ్లలో అపరిశుభ్రతపై 1000కు పైగా ఫిర్యాదులు అందాయి.

తూర్పు భారతదేశానికి వెళ్లే రైళ్ల నుంచి చాలా వరకు ఫిర్యాదులు వస్తున్నాయంట. మురికి, కంపు విషయానికొస్తే, ఉత్తరాన్ని కలుపుతున్న టాప్ 10 రైళ్లలో 7 రైళ్లు ఉన్నాయి. ఈస్ట్ ఇండియా వ్యాలీలో మిగిలినవి ఉన్నాయి. ముంబై నుంచి మాతా వైష్ణో దేవి కత్రా వెళ్లే రైళ్లు కూడా మురికిగా కనిపించాయి. ఎక్స్ ప్రెస్ రైళ్లతో పాటు రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులో కూడా అపరిశుభ్రతపై ప్రజలు ఫిర్యాదు చేశారు. మురికి, కంపును తొలగించేందుకు ఇప్పుడు రైళ్లలో ఆన్‌బోర్డ్‌ హౌస్‌ కీపింగ్‌ సేవలను ప్రారంభించినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. దీని కింద ఫిర్యాదు అందిన వెంటనే రైలును శుభ్రం చేస్తుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories