ఈ విదేశీ బ్యాంకు ఇండియాకి మళ్లీ వస్తోంది.. కొత్త నియామకాలు చేపడుతోంది..

Foreign Bank Barclays is coming back to India Making New Appointments | Business News
x

ఈ విదేశీ బ్యాంకు ఇండియాకి మళ్లీ వస్తోంది.. కొత్త నియామకాలు చేపడుతోంది..

Highlights

Barclays Bank: UK బ్యాంకు బార్క్లేస్ తిరిగి ఇండియాకి రావడానికి ప్రయత్నిస్తోంది. పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది...

Barclays Bank: UK బ్యాంకు బార్క్లేస్ తిరిగి ఇండియాకి రావడానికి ప్రయత్నిస్తోంది. పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది. అంతేకాదు పెద్ద ఎత్తున ఉద్యోగస్థులను నియమించుకోవాలని యోచిస్తోంది. 2016 తర్వాత ఈ బ్యాంకు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కొన్ని ఆర్థిక వ్యవస్థలకు తిరిగి రావాలని ఆలోచిస్తుంది.

బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం.. ఈ బ్యాంకు గతంలో వదిలేసిన మార్కెట్‌లకు తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. చైనా, భారతదేశం, సింగపూర్, ఆస్ట్రేలియాలో తన పరిధిని విస్తరించడానికి ప్రయత్నిస్తోంది.

ఈ సమాచారాన్ని స్వయంగా కంపెనీ ఆసియా పసిఫిక్, ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జైదీప్ ఖన్నా బ్లూమ్‌బెర్గ్‌కి తెలిపారు. కంపెనీ జపాన్, హాంకాంగ్‌లలో కూడా కొత్త వ్యక్తులను రిక్రూట్ చేస్తోంది. ఎందుకంటే ఈ దేశాలలో లాభాలు ఆర్జిస్తున్నట్లు ఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇది 2022లో కూడా కొనసాగుతుందని వారు భావిస్తున్నారు.

దీన్ని కొనసాగించడమే ప్రస్తుత లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.బార్క్లేస్ మాజీ CEO జెస్ స్టాలీ ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలను తొలగించారు. ఇది ఆసియా అంతటా దాని నగదు సెక్యూరిటీలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

ఆ సమయంలో బ్యాంకు కొన్ని దేశాల్లో తన కార్యకలాపాలను పెంచుకుంది. వీటిలో ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, మలేషియా ఉన్నాయి. 2021-22లో కంపెనీ వ్యాపారం 2016కి ముందు కంటే చాలా భిన్నంగా ఉందని ఖన్నా చెప్పారు. కంపెనీ ఇప్పుడు మరింత శ్రద్ధ చూపుతోందని పేర్కొన్నారు.

బ్యాంక్ ప్రత్యర్థి HSBC హోల్డింగ్స్ Plc. స్టాండర్డ్ చార్టర్డ్ Plc కూడా ఆసియాలో తన ఉనికిని విస్తరిస్తోంది. బార్క్లేస్ ఇప్పటికే చైనాలో వ్యూహాత్మక నియామకాలు చేసింది. ప్రత్యేక పరిస్థితులలో రుణాలు, రుణ వ్యాపారం కోసం బ్యాంక్ ప్రాంతీయ అధిపతిని కూడా నియమించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories