క్రెడిట్‌ కార్డు సైజులో ఆధార్‌.. అప్లై చేసుకోండి ఇలా!

క్రెడిట్‌ కార్డు సైజులో ఆధార్‌.. అప్లై చేసుకోండి ఇలా!
x
Highlights

PVC Aadhar card : ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరి.. ఆన్లైన్ వేదికగా దేనికి అప్లై చేసిన సరే ఆధార్ ఉండాల్సిందే.. అయితే ఇప్పుడు ఆధార్ కొంత రూపును సంతరించుకుంది..

PVC Aadhar card : ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరి.. ఆన్లైన్ వేదికగా దేనికి అప్లై చేసిన సరే ఆధార్ ఉండాల్సిందే.. అయితే ఇప్పుడు ఆధార్ కొంత రూపును సంతరించుకుంది.. ఇప్పుడు ఆధార్ డెబిట్/క్రెడిట్ కార్డు సైజ్ లోకి మారిపోయింది.. ఇది పర్స్‌లో ఇమిడిపోయేంత చిన్నగా ఉండనుంది. పాలీ వినైల్ క్లోరైడ్‌తో రూపొందే ఈ కార్డు ధర రూ. 50గా నిర్ణయించారు. దీనిని కావాలనుకున్న వారు ఇలా అప్లై చేసుకోవాలి .. ఇలా అప్లై చేసుకున్న పది రోజుల తరవాత కొత్త ఆధార్ కార్డును మీరు పొందవచ్చు..

ఎలా అప్లై చేయాలంటే...


ముందుగా పీవీసీ ఆధార్‌ కార్డు అప్లయ్‌ చేసేందుకు గాను https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్ళవలసి ఉంటుంది.


ఆ తర్వాత గెట్ ఆధార్ అనే దగ్గర order-pvcreprint అనే ఆప్షన్ క్లిక్ చేసి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ( ఆధార్‌ నంబర్‌ లేదా వర్చువల్‌ ఐడీ, ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ ఎంటర్‌ చేయాలి )


ఆ తరవాత క్యాప్చా కోడ్‌, మీ ఆధార్‌తో లింక్‌ చేసిన మొబైల్‌ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.


ఆ తర్వాత మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని అందులో ఎంటర్ చేయాలి


దీని తర్వాత మీకు కొత్త పేజీ ఒపెన్ అవుతుంది. అందులో మీ డీటేల్స్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.


ఇక చివరగా పేమెంట్‌ పేజీలో క్రెడిట్‌ కార్డు/ డెబిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిని ఉపయోగించి మీరు పేమెంట్‌ చేయొచ్చు.


ఇలా చేసిన పదిరోజుల తర్వాత మీ ఇంటి అడ్రస్ కి మీ కొత్త కొత్త ఆధార్‌ కార్డు వస్తుంది. ఇక ఆధార్‌ కార్డు స్టేటస్‌ తెలుసుకోవాలంటే ఎస్‌ఆర్‌ఎన్‌ నంబర్‌ను ఉపయోగించి ఉడాయ్‌ వెబ్‌సైట్‌లో గెట్‌ ఆధార్‌ సెక్షన్ లో స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు!

Show Full Article
Print Article
Next Story
More Stories