Home Loan Tips: హోమ్ లోన్.. ఈ మూడు చిట్కాలు పాటిస్తే ఈజీ..!

Follow These Three Tips to get Approved for a Home Loan From the Bank Easily
x

Home Loan Tips: హోమ్ లోన్.. ఈ మూడు చిట్కాలు పాటిస్తే ఈజీ..!

Highlights

Home Loan Tips: మనలో చాలా మంది సొంత ఇల్లు ఉండాలని కలలు కంటారు. కానీ కొంతమందికి సొంత ఇల్లు కొనేంత ఆర్థిక పరిస్థితి ఉండదు.

Home Loan Tips: మనలో చాలా మంది సొంత ఇల్లు ఉండాలని కలలు కంటారు. కానీ కొంతమందికి సొంత ఇల్లు కొనే ఆర్థిక పరిస్థితి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో హోమ్ లోన్ తీసుకోవడం ఉత్తమం. హోమ్ లోన్ ప్రతి నెలా చిన్న ఈఎమ్ఐలు చెల్లించడం ద్వారా సొంత ఇంటి కల నెరవేరుతుంది. రుణ మొత్తాన్ని చెల్లించగల సామర్థ్యం ఉన్న వ్యక్తులకు మాత్రమే బ్యాంకులు హోమ్ లోన్స్ ఇస్తాయి. అయితే చాలా సార్లు బ్యాంకులు లోన్‌ని ఆమోదించవు. ఎందుకంటే తిరిగి చెల్లించలేని పరిస్థితులను బ్యాంక్‌లు అనుమతించవు. అటువంటి పరిస్థితుల్లో మీ హోమ్ లోన్ బ్యాంక్ నుంచి సులభంగా ఆమోదించడానికి ఈ మూడు చిట్కాలను పాటించండి. ఇవి మీకు ఉపయోగంగా ఉంటాయి.

చెక్ క్రెడిట్ స్కోర్

ఏదైనా బ్యాంకు గృహ రుణం ఇచ్చే ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను ఖచ్చితంగా చెక్ చేస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ లోన్‌ను తిరిగి చెల్లించడానికి మీరు ఎంత సామర్థ్యం కలిగి ఉన్నారో చూపిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీ క్రెడిట్ స్కోర్‌ను బాగా ఉంచుకోండి. మీరు మీ అన్ని బిల్లులను సకాలంలో చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోవచ్చు.

డౌన్ పేమెంట్

లోన్ తీసుకుంటున్నప్పుడు ఎక్కువ డౌన్ పేమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సాధారణంగా లోన్ తీసుకునేటప్పుడు మీ డౌన్ పేమెంట్ మొత్తం లోన్ మొత్తంలో 10 నుండి 20 శాతం ఉండాలి.

మీ ఆదాయ వనరులను పెంచుకోండి

నెలవారీ ఆదాయం ఎక్కువగా ఉన్న వారికి బ్యాంకులు చాలా త్వరగా గృహ రుణాలను మంజూరు చేస్తాయి. అంతేకాకుండా ఉపాధి పరంగా ట్రాక్ రికార్డ్ స్థిరంగా ఉన్న వ్యక్తుల రుణాలను కూడా బ్యాంకులు ఆమోదిస్తాయి. లోన్ తీసుకునే ముందు మీరు ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగం కోసం వెతకవచ్చు లేదా మీరు ఫ్రీలాన్సింగ్ ఎంపికను కూడా ఎంచుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories