January Bank Holidays 2024: బ్యాంకు పనులు త్వరగా ముగించండి.. వరుసగా సెలవులు వస్తున్నాయి..!

Finish The Bank Work Quickly 3 Consecutive Days Of Holidays Are Coming
x

January Bank Holidays 2024: బ్యాంకు పనులు త్వరగా ముగించండి.. వరుసగా సెలవులు వస్తున్నాయి..!

Highlights

January Bank Holidays 2024: ఈ వారంలో ఏమైనా బ్యాంకు పనులు ఉన్నట్లయితే వెంటనే ముగించండి. లేదంటే రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది.

January Bank Holidays 2024: ఈ వారంలో ఏమైనా బ్యాంకు పనులు ఉన్నట్లయితే వెంటనే ముగించండి. లేదంటే రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వీక్‌లో చాలా రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. ఈ వీక్‌ ఎండ్‌లో వరుసగా మూడు రోజులు కొన్నిరాష్ట్రాల్లో నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి.

కొన్నిరాష్ట్రాల్లో గురువారం సెలవు కారణంగా వరుసగా 4 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. జనవరి 2024లో బ్యాంకులకు రెండవ శనివారం, నాల్గవ ఆదివారం ప్రాంతీయ సెలవులతో సహా మొత్తం 16 సెలవులు వచ్చాయి. ఈ తేదీల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

23, జనవరి (మంగళవారం) మణిపూర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.

25, జనవరి (గురువారం) మహమ్మద్ హజ్రత్ అలీ పుట్టినరోజు- తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి.

26, జనవరి (శుక్రవారం) గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.

27వ తేదీ నెలలో నాల్గవ శనివారం అవుతుంది. ఈ రోజు దేశంలోని అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి. ఆదివారం హాలిడే కాబట్టి బ్యాంకులు మూసి ఉంటాయి. లాంగ్ వీకెండ్ జనవరి 25 నుంచే ప్రారంభమవుతుంది. ఉదాహరణకు తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో స్థానిక సెలవుల కారణంగా వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూసి ఉంటున్నాయి.

ఇక జనవరి 18న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులో అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జనవరి 22 న ఆఫ్‌ డే సెలవు పాటించాలని కోరిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories