PM Kisan 19th Installment: రైతులకు అలర్ట్‌.. ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే పీఎం కిసాన్ డబ్బులు పడవు..!

Farmers Should do This Thing Before Releasing PM Kisan 19th Installment
x

PM Kisan 19th Installment: రైతులకు అలర్ట్‌.. ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే పీఎం కిసాన్ డబ్బులు పడవు..!

Highlights

PM Kisan 19th Installment: దేశంలో రైతులకు ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో పీఎం కిసాన్‌ యోజన(PM Kisan Yojana) పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

PM Kisan 19th Installment: దేశంలో రైతులకు ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో పీఎం కిసాన్‌ యోజన(PM Kisan Yojana) పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా కోట్లాది మంది రైతులకు ఏడాది మొత్తంలో మూడు విడతల చొప్పున రూ. 6వేలు ఇస్తుందన్న విషయం విధితమే. ఇందులో భాగంగానే తాజాగా రైతులకు 19వ విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఈ ఏడాది చివరిలో రైతుల ఖాతాల్లో డబ్బులు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ పథకంలో భాగంగా డీబీటీ విధానం ద్వారా రైతుల ఖాతాల్లోకి రూ. 2000ను అందించనున్నారు. త్వరలో 19వ విడత నిధులు అకౌంట్‌లో పడనున్న నేపథ్యంలో రైతులు(Farmers) కచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. అకౌంట్‌లో డబ్బులు పడాలంటే కచ్చితంగా రైతు మొబైల్‌ నెంబర్ యాక్టివ్‌గా ఉండాలి. అలాగే మొబైల్‌ నెంబర్‌, ఆధార్‌తో లింక్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఆధార్‌, మొబైల్‌ నెంబర్ ఈ కేవైసీ చేసిన వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని చెబుతున్నారు.

ఈ కేవైసీ(eKYC) చేసే సమయంలో ఆధార్‌ లింక్డ్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్‌ చేస్తే కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి రైతులు కచ్చితంగా తమ సిమ్‌ కార్డును యాక్టివ్‌లో ఉంచుకోవాలని చెబుతున్నారు. 19వ విడత డబ్బులు పడుతోన్న నేపథ్యంలో మొబైల్‌ నెంబర్‌ అప్‌డేట్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే PM కిసాన్ సమ్మాన్ నిధి వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే రైతు రిజిస్టర్‌ మొబైల్ నెంబర్‌కి మెసేజ్‌ వస్తుంది.

ఇక నెంబర్ అప్‌డేట్‌ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందు కోసం ముందుగా పీఎం కిసాన్‌(PM Kisan) అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం అక్కడ కనిపించే.. 'అప్‌డేట్ మొబైల్ నంబర్' అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం ఆధార్‌ కార్డు లేదా రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత సెర్చ్‌ ఆప్షన్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేసుకొని మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఉన్న మీ యాక్టివ్‌ మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇదండీ 19వ విడత పీఎం కిసాన్‌ నిధులు రైతుల ఖాతాల్లోకి రావాలంటే వెంటనే ఈ పని చేయాలని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories