500 Rupee Note: ఆందోళన కలిగిస్తున్న రూ.500 నోట్లు.. ఇవి మీ దగ్గర ఉన్నాయా..?

Fake 500 Rupee Note Check Your RS 500 Note as Original or Duplicate
x

500 Rupee Note: ఆందోళన కలిగిస్తున్న రూ.500నోట్లు.. ఇవి మీ దగ్గర ఉన్నాయా..?

Highlights

500 Rupee Note: ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2016 నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేసి కోట్లాది కోట్ల నల్లధన వ్యాపారులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే.

500 Rupee Note: ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2016 నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేసి కోట్లాది కోట్ల నల్లధన వ్యాపారులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లను భారత్‌లో పూర్తిగా నిషేధించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రూ. 2000 నోట్లు, రూ. 500 నోట్లు కూడా ప్రత్యేకమైన కొత్త డిజైన్‌తో చెలామణిలోకి తీసుకొచ్చింది. గతేడాది కేంద్ర ప్రభుత్వం రూ. 2000 నోట్లను రద్దు చేసింది. చాలామంది ఇప్పటికే ఈ నోట్లను ఆర్‌బిఐ బ్యాంకుకు సమర్పిస్తున్నారు. అయితే ఉపసంహరణ తర్వాత నకిలీ రూ. 500 నోట్లు భారీగా చెలామణి అవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నకిలీ రూ. 500 నోట్లు దాదాపు 317 శాతం పెరిగాయి. 2019లో నకిలీ నోట్లు 21,865 మిలియన్లుగా ఉన్నాయి. అయితే, ఈ సంఖ్య ఇప్పుడు 91,110 మిలియన్లకు పెరిగినట్లు తెలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ నకిలీ నోట్లు దాదాపు 15 శాతం పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం నకిలీ నోట్ల సంఖ్య 317 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే త్వరలో ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.

ముఖ్యంగా కరోనా కాలంలో నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయని కేంద్రం తెలిపింది. ఈ సమయంలో ఇది 79,669 మిలియన్లకు చేరుకుంది. అయితే ప్రస్తుతం చాలా మంది ఈ నకిలీ నోట్లను గుర్తించలేకపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో ఈ నకిలీ రూ.500 నోట్లు అధికంగా చలామణీ అవుతున్నాయి. వీధి వ్యాపారులు వీటికి ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. ఈ కేటుగాళ్లు వీధుల్లో, బస్టాండ్‌లలో, బజార్లలో నకిలీ నోట్లు చెలామణీ చేస్తున్నారు.

మరి ఈ రూ. 500 నోటు నకిలీనా లేక అసలైనదా? అనేది ఎలా గుర్తించాలంటే.. రూ.500 నోటు తీసుకునే ముందు రెండు సార్లు పరీక్షించుకోవాలి. ప్రతి నోటుపై నిలువుగా ఒక పెద్ద గీత ఉంటుంది. ఈ గీత ఒరిజినల్‌ నోటుపై ఆకు పచ్చ రంగులో ఉంటుంది. అయితే ఇది నకిలీ నోటులో మాత్రం.. దానిని వంచిన తర్వాత ముదురు రంగులోకి మారిపోతుంది. చాలా మంది గమనించి ఉండరు. ప్రతి నోటుపై కుడి, ఎడమ వైపున కాస్త ఖాళీ ప్రదేశం ఉంటుంది. అలాగే అందులో ప్రత్యేకమైన రూ.500 అని వాటర్‌ మార్క్‌ ఉంటుంది. కొన్ని నకిలీ నోట్లపై ఇలాంటివి ఉండవు.

Show Full Article
Print Article
Next Story
More Stories