Eucalyptus: ఈ చెట్ల వ్యాపారంతో లక్షల ఆదాయం.. ఎలాగో తెలుసుకోండి..!

Eucalyptus Tree Business Can Earn Millions of Rupees Learn How to Do Business
x

Eucalyptus: ఈ చెట్ల వ్యాపారంతో లక్షల ఆదాయం.. ఎలాగో తెలుసుకోండి..!

Highlights

Eucalyptus: ఈ చెట్ల వ్యాపారంతో లక్షల ఆదాయం.. ఎలాగో తెలుసుకోండి..!

Eucalyptus: యూకలిప్టస్ చెట్టుని అందరు చూసే ఉంటారు. దీనిని ఆయుర్వేదం ఎక్కువగా వినియోగిస్తారు. దీని ఆకులు, చెట్లతో మందులు తయారుచేస్తారు. దీని కలప కూడా ఎంతో బలంగా ఉంటుంది. యూకలిస్టస్ చెట్టు నుంచి వచ్చే నూనె, తేనె ఎన్నో రోగాలని నయం చేసే గుణాలని కలిగి ఉంటాయి. సాధారణంగా ప్రజలు యూకలిప్టస్ చెట్టుని కలప కోసం ఉపయోగిస్తారు. ఈ చెట్టు చాలా నీటిని గ్రహిస్తుంది. కాబట్టి ఇది నది-కాలువ వెంట లేదా చిత్తడి ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంది. దీని ఆకుల నుంచి నూనె తీసి ఔషధాలు తయారు చేస్తారు. దీని పువ్వుతో తేనె తయారు చేస్తారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ తేనె జుట్టు, చర్మ సమస్యలకి చాలా బాగా పనిచేస్తుంది.

యూకలిప్టస్ నుంచి వచ్చే నూనె, తేనె రుచిని ప్రజలు చాలా ఇష్టపడతారు. ఈ నూనెని డాబర్, పతంజలి తదితర సంస్థలకి సరఫరా చేస్తారు. యూకలిప్టస్ చెట్టు నీటిలో పెరుగుతుంది కానీ హైబ్రిడ్ యూకలిప్టస్ ఎక్కువ నీటిని తట్టుకోదు. ఇది నీటిలో ఎక్కువసేపు ఉంటే ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. దీని ప్రకారం ఈ మొక్క పర్యావరణ అనుకూలమైనది అంతేకాక ఔషధ పరంగా చాలా ముఖ్యమైనది. యూకలిప్టస్‌లో కొన్ని జాతులు ఉన్నాయి.

వీటిని ఔషధతైలం తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ (సిఐఎంఎపి) శాస్త్రవేత్త రాజేష్ వర్మ చెప్పారు. వాటిలో యూకలిప్టస్‌కి సంబంధించి పదమూడు జాతులు ఉన్నట్లు చెప్పారు. ఈ జాతులు ఎక్కువ ఎత్తు పెరగవు. వీటి నుంచి నొప్పి నివారణ ఔషధతైలం, ఇతర మందులు తయారు చేస్తారు. తేనె దాని పువ్వుల నుంచి తయారవుతుంది. లోతట్టు ప్రాంతాల్లో ఈ చెట్లని పెంచవచ్చు.

ఢిల్లీకి చెందిన అరుణ్ పాండే 2018 నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల మొక్కలు నాటాడు. ఇందులో డజనుకు మందికి పైగా ఉపాధి లభించింది. దీని నుంచి నూనె తయారు చేయడానికి ఆకులను ట్యాంక్‌లో వేసి వేడి చేస్తారని పాండే చెప్పాడు. దీని కారణంగా నూనె, ఆవిరి కలిసి బయటకు వస్తాయి. వీటిని సెపరేట్‌గా మళ్లీ వేరు చేస్తారు. ఈ నూనె డాబర్, పతంజలి తదితర ప్రాంతాలకు సరఫరా అవుతుందని అరుణ్ చెప్పాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories