మహిళలకు ఉచిత సౌకర్యాలు కల్పిస్తున్న ESIC.. ఆ సమయంలో 26 వారాల పాటు పూర్తి జీతం

ESIC Providing Free Facilities for Women Full Pay for 26 Weeks During Maternity Leave
x

Representational Image

Highlights

ESIC: ESIC అనేది భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది.

ESIC: ESIC అనేది భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది. ESIC దేశంలోని దాదాపు 13 కోట్ల మందికి చికిత్స, కొన్ని ఇతర సౌకర్యాల ప్రయోజనాన్ని అందిస్తుంది. ESICలో ఇన్సూరెన్స్‌ చేసిన ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తుంది. ఒక సాధారణ మహిళ ESICలో ఇన్సూరెన్స్‌ చేసి ఉన్నా లేదా ఆమెకి సంబంధించిన వ్యక్తులు ESICలో ముడిపడి ఉంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఆమెకు అనేక సౌకర్యాలు కల్పిస్తారు.ESIC దీని గురించి ఒక ట్వీట్ చేసింది.

మాతృత్వం సమయంలో మహిళలకు మరింత శ్రద్ధ అవసరమని, ప్రసూతి సెలవు సమయంలో మహిళలకు జీతం చెల్లిస్తామని ట్వీట్‌ చేసింది. దీని గురించి తెలుసుకుందాం. ఈ ESI పథకంలో గర్భధారణ సమయంలో బీమా చేయబడిన మహిళా సభ్యులకు ప్రసూతి సెలవు సమయంలో 26 వారాలపాటు ప్రతి రోజు జీతంలో 100 శాతం వరకు చెల్లిస్తారు. ఒక మహిళా ఉద్యోగి ప్రసూతి సెలవులు, జీతం పరిహారం కోసం వివరాలను కోరుకుంటే ఆమె ESIC వెబ్‌సైట్ www.esic.nic.inని సందర్శించవచ్చు.

ప్రయోజనాలు ఏమిటి

బీమా చేసిన మహిళా సభ్యులు ప్రసూతి సెలవుతో పాటు అనేక ఇతర సౌకర్యాలను పొందుతారు. ఈ పథకంలో వైద్య ఖర్చుల మాఫీ, చికిత్స కోసం ఆసుపత్రిలో చేరడం, శస్త్రచికిత్స, నిరుద్యోగ భృతి, వైకల్యం, ఉద్యోగం సమయంలో గాయమైతే ఆర్థిక సహాయం అందిస్తారు. బీమా చేసిన ఉద్యోగి మరణించినప్పుడు ఉద్యోగి సమీప బంధువులకు రూ. 15,000 వరకు చెల్లిస్తారు. ఉద్యోగ విరమణ పొందిన, శాశ్వతంగా వికలాంగులైన భీమా పొందిన వ్యక్తుల జీవిత భాగస్వాములకు ప్రతి సంవత్సరం రూ.120 చెల్లించి వైద్య సంరక్షణ అందిస్తారు.

ఈ ప్రయోజనాన్ని పొందడానికి, ఉద్యోగి, అతని కంపెనీ నెలవారీ జీతంలో కొంత భాగాన్ని ESICలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గర్భధారణ సమయంలో ప్రసూతి ప్రయోజనం 26 వారాల పాటు ఇస్తారు. అయితే వైద్యుని సలహా మేరకు ఒక నెల పాటు పొడిగించవచ్చు. ఈ సమయంలో పూర్తి జీతం ఇస్తారు. ఇది కాకుండా ESIC ఉద్యోగి లేదా బీమా చేసిన ఉద్యోగి కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియలు చేసే వ్యక్తిపై ఆధారపడిన వారికి రూ.15,000 అందిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories