EPFO: దీపావళి వేళ ఈపీఎఫ్ఓ శుభవార్త..నేడు వారి అకౌంట్లోకి డబ్బులు

EPFO: దీపావళి వేళ ఈపీఎఫ్ఓ శుభవార్త..నేడు వారి అకౌంట్లోకి డబ్బులు
x
Highlights

EPFO: దీపావళి పండగ వేళ ఈపీఎఫ్ఓ అదిరే శుభవార్త చెప్పింది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ పొందే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. వీరికి ముందుగానే...

EPFO: దీపావళి పండగ వేళ ఈపీఎఫ్ఓ అదిరే శుభవార్త చెప్పింది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ పొందే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. వీరికి ముందుగానే పెన్షన్ డబ్బులు అకౌంట్లోకి జమ కానున్నాయి. ఈపీఎఫ్ఓ తెలిపిన వివరాల ప్రకారం దీపావళి పండగ, పబ్లిక్ హాలిడేస్ సందర్భంగా 2024 అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులను నేడు అనగా అక్టోబర్ 29న మంగళవారం రిలీజ్ చేయనుంది.

పెన్షన్లు వారి పెన్షన్ డబ్బులను అక్టోబర్ 30న విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పింది. ఎందుకంటే అక్టోబర్ 31న సెలవు ఉంటుంది. దీంతో పెన్షన్ పొందేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పండగ పూట ఇది ఎంతో ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు. అంతేకాదు అన్ని జోనల్ అండ్ రీజినల్ ఆఫీసులకు కూడా ఈపీఎఫ్ఓ కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు పెన్షన్ డబ్బులు సరైన సమయానికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ అనేది ఒక సామాజిక భద్రత స్కీమ్. దీని ద్వారా ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందుతారు. ఎంప్లాయిస్ కంపెనీలు ఈ స్కీమ్ కు కొంత మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేస్తాయి. ఉద్యోగి వాటాతోపాటు , కంపెనీ వాటాలో 8.33శాతం ఈ స్కీమ్ లో జమ అవుతాయి. ఈపీఎఫ్ఓ సభ్యులకు ఈపీఎస్ పెన్షన్ పొందే ఛాన్స్ ఉంటుంది. కనీసం 10ఏళ్ల పాటు సర్వీస్ కలిగి ఉండటం తప్పనిసరి. కనీసం 50 సంవత్సరాల వయస్సు వచ్చి ఉండాలి. ముందస్తు పెన్షన్ కు ఈ వయసు ప్రాతిపదికన తీసుకుంటారు. రెగ్యులర్ అయితే 58సంవత్సరాలు నిండి ఉండాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories