EPFO: ఈపీఎఫ్‌వో అలర్ట్‌.. ఉద్యోగులు విస్మరిస్తే అంతే సంగతులు..!

EPFO Alert Employees Should not Share Personal Information With Anyone
x

EPFO: ఈపీఎఫ్‌వో అలర్ట్‌.. ఉద్యోగులు విస్మరిస్తే అంతే సంగతులు..!

Highlights

EPFO: మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈపీఎఫ్‌వో అలర్ట్‌ గురించి తెలుసుకోండి.

EPFO: మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈపీఎఫ్‌వో అలర్ట్‌ గురించి తెలుసుకోండి. మీరు ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రైవేట్‌ ఉద్యోగి అయినా ఈపీఎఫ్‌వోలో సభ్యుడిగా ఉంటే ప్రతినెలా పీఎఫ్‌ కట్‌ అవుతుంది. అయితే వీరందరి క్షేమం కోసం కంపెనీ ఓ హెచ్చరికను జారీ చేసింది. ఈపీఎఫ్‌వో పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయని ఉద్యోగులు అలర్ట్‌గా ఉండాలని సూచించింది.

ఈపీఎఫ్‌వో వ్యక్తిగత సమాచారాన్ని అడగదు గతంలో కూడా ఈపీఎఫ్‌వో ఇలాంటి హెచ్చరికలు జారీ చేసింది. అయితే గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా పెరిగాయి. ఈపీఎఫ్‌వో తన సభ్యుల నుంచి ఫోన్, సోషల్ మీడియా, వాట్సాప్‌, మొదలైన వాటి ద్వారా పాన్, ఆధార్, UAN, బ్యాంక్ ఖాతా, OTP వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడగదు. ఈ విషయాన్ని సభ్యులు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. అపరిచిత కాల్స్‌, వాట్సాప్ కాల్స్‌కి సమాధానం ఇవ్వకూడదు.

సోషల్ మీడియా, వాట్సాప్ మొదలైన వాటి ద్వారా డబ్బులు డిపాజిట్ చేయమని ఈపీఎఫ్‌వో ఎప్పుడు అడగదని సభ్యులని హెచ్చరించింది. ఇలాంటి ఫేక్‌ కాల్ లేదా వాట్సాప్ కాల్‌లకు సమాధానం ఇవ్వకూడదని సూచించింది. ఈపీఎఫ్‌వో సభ్యుల బేసిక్ జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 12 శాతం జమ అవుతుంది. ఈ 12 శాతంలో రెండు భాగాలుంటాయి. మొదటి భాగం 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ ఖాతా (EPS)కి మిగిలిన 3.67 శాతం మొత్తం EPF ఖాతాకు వెళుతుంది. ఉద్యోగి రిటైర్మెంట్‌ సమయంలో ఈ మొత్తాన్ని పొందాలనే నిబంధన ఉంటుంది. అయితే అత్యవసరమైతే వీటిని కూడా తీసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories