EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకి అలర్ట్‌.. ఆ విషయంలో ఇద్దరికి అవకాశం..!

EPF Members can Make More Than one Nominee it is a Complete Online Process
x

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకి అలర్ట్‌.. ఆ విషయంలో ఇద్దరికి అవకాశం..!

Highlights

EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)సభ్యులకు ఈ-నామినేషన్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)సభ్యులకు ఈ-నామినేషన్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. సేవింగ్స్ ప్లాన్ ఖాతాలో ఖాతాదారుని తరపున నామినీని ప్రకటించడం ఎప్పటినుంచో వస్తుంది. దీనివల్ల ఖాతాదారుడు మరణిస్తే నామినీకి డబ్బు వెళ్తుంది. మీరు ఒకవేళ నామినీ పేరు నమోదు చేయకపోతే ఖాతాదారు ఈపీఎఫ్‌వో ప్రయోజనాలని కోల్పోవలసి ఉంటుంది.

ఖాతాదారునికి, అతని కుటుంబ సభ్యులకు పీఎఫ్‌ ప్రయోజనాన్ని పొందడానికి ఈ-నామినేషన్ చాలా సహాయపడుతుంది. ఎవరైనా పీఎఫ్‌ ఖాతాదారుడు మరణిస్తే పెన్షన్, బీమా, ప్రావిడెంట్ ఫండ్ విషయాల పరిష్కారం, ఆన్‌లైన్ క్లెయిమ్ ఇప్పటికే ఈ -నామినేషన్ చేసి ఉంటే సులువవుతుంది. ఈపీఎఫ్‌వోల ఈ-నామినేషన్ తప్పనిసరి అని తెలుసుకోండి. పీఎఫ్‌ ఖాతాదారు తన కుటుంబ సభ్యులను మాత్రమే నామినీగా గుర్తించగలరు.

కానీ ఒక వ్యక్తికి కుటుంబం లేదంటే నామినీగా వేరే వ్యక్తిని ప్రకటించవచ్చు. కుటుంబానికి వెలుపల ఉన్న వ్యక్తిని నామినీగా చేసి ఆ తర్వాత కుటుంబానికి తెలిస్తే కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రయోజనం దక్కుతుందని గుర్తుంచుకోండి. ఆ సమయంలో బంధువుల నామినేషన్ రద్దు అవుతుంది. పిఎఫ్ ఖాతాదారుడు నామినీని పేర్కొనకుండానే ప్రపంచాన్ని విడిచిపెట్టినట్లయితే వారసత్వ ధృవీకరణ పత్రం పొందడానికి సివిల్ కోర్టుకు వెళ్లాలి.

పీఎఫ్‌ ఖాతాదారులు ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ మంది నామినీలను నమోదు చేసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ మంది నామినీలను ప్రకటిస్తున్నట్లయితే మీరు పూర్తి వివరాలను అందించాల్సి ఉంటుంది. ఏ నామినీకి ఎంత మొత్తం ఇవ్వాలో పేర్కొనాలి. తద్వారా ఎలాంటి వివాదాలు ఉండవని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories