పదేళ్లు దాటిన పిల్లలపై ఈ ఖాతా తెరవండి.. నెలకి రూ.2500 పొందండి..?

Enroll children in Post Office MIS Scheme get Rs.2500 per month
x

పదేళ్లు దాటిన పిల్లలపై ఈ ఖాతా తెరవండి.. నెలకి రూ.2500 పొందండి..?

Highlights

Post Office MIS: తక్కువ రిస్క్‌తో లాభాలు పొందాలనుకునే వారికి పోస్టాఫీసు పథకాలు ప్రయోజనకరంగా ఉంటాయి.

Post Office MIS: తక్కువ రిస్క్‌తో లాభాలు పొందాలనుకునే వారికి పోస్టాఫీసు పథకాలు ప్రయోజనకరంగా ఉంటాయి. పోస్టాఫీసు MIS పథకం అటువంటిదే. ఇందులో ఒక్కసారి డబ్బు పెట్టుబడి పెడితే ప్రతి నెలా వడ్డీ రూపంలో ప్రయోజనాన్ని పొందుతారు. ఈ ఖాతా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 10 ఏళ్లు పైబడిన పిల్లల పేరిట ఈ ఖాతాను తెరవవచ్చు. ప్రతి నెలా పొందే వడ్డీతో ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చు. ఈ పథకం అన్ని వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం.

మీరు ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి ఈ ఖాతాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీని కింద కనిష్టంగా రూ.1000, గరిష్టంగా రూ.4.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ పథకం కింద వడ్డీ రేటు 6.6 శాతంగా ఉంది. పిల్లల వయస్సు 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే మీరు వారి పేరుపై ఈ ఖాతాను తెరవవచ్చు. ఒకవేళ తక్కువగా ఉంటే తల్లిదండ్రులు ఖాతాను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ పథకం మెచ్యూరిటీ 5 సంవత్సరాలు. ఆ తర్వాత క్లోజ్ చేస్తారు.

మీ పిల్లల వయస్సు 10 సంవత్సరాలు. వారి పేరు మీద రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా మీ వడ్డీ ప్రస్తుత 6.6 శాతం ప్రకారం రూ. 1100 అవుతుంది. ఐదేళ్లలో ఈ వడ్డీ మొత్తం 66 వేల రూపాయలు అవుతుంది. చివరిగా మీరు 2 లక్షల రూపాయల రిటర్న్ కూడా పొందుతారు. ఈ విధంగా మీరు పిల్లల చదువు కోసం ఉపయోగించగల 1100 రూపాయలు పొందుతారు. ఈ మొత్తం తల్లిదండ్రులకు మంచి సహాయంగా ఉంటుంది.

ఈ ఖాతా ప్రత్యేకత ఒక్కరు లేదా ముగ్గురు పెద్దలతో ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. మీరు ఈ ఖాతాలో రూ. 3.50 లక్షలు జమ చేస్తే ప్రస్తుత రేటు ప్రకారం ప్రతి నెలా రూ.1925 పొందుతారు. బడిలో చదివే పిల్లలకు ఇది చాలా పెద్ద మొత్తం. ఈ పథకం గరిష్ట పరిమితి అంటే 4.5 లక్షలు డిపాజిట్ చేస్తే మీరు ప్రతి నెలా రూ. 2475 ప్రయోజనం పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories