Employees: ఉద్యోగులకి అలర్ట్‌.. ఈ పథకం కింద 7 లక్షల ప్రయోజనం..!

Each Client of EPFO Will get Rs 7 lakh Benefit Under Employee Deposit Linked Scheme
x

Employees: ఉద్యోగులకి అలర్ట్‌.. ఈ పథకం కింద 7 లక్షల ప్రయోజనం..!

Highlights

Employees: ప్రభుత్వం అందించే ఈపీఎఫ్ పథకం ద్వారా ప్రతి ఖాతాదారునికి రూ.7 లక్షల ప్రయోజనం లభిస్తుంది.

Employees: ప్రభుత్వం అందించే ఈపీఎఫ్ పథకం ద్వారా ప్రతి ఖాతాదారునికి రూ.7 లక్షల ప్రయోజనం లభిస్తుంది. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ స్కీమ్ (EDLI)కింద పీఎఫ్‌ ఖాతాదారులకు ఈ బీమా రక్షణను ప్రభుత్వం అందజేస్తుంది. ప్రతి ఈపీఎఫ్‌వో ఖాతాదారుడు ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ స్కీమ్ కింద బీమా రక్షణను పొందుతాడు. ఉద్యోగంలో ఉన్నప్పుడు మరణిస్తే ఖాతాలో జమ అయిన డబ్బు నామినీకి లేదా ఖాతాదారుడి నామినీకి ఇస్తారు.

ఈ పథకం కింద ఖాతాదారుడు ప్రమాదంలో మరణిస్తే కుటుంబ సభ్యులు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ స్కీమ్ బీమా డెత్ క్లెయిమ్ చేయవచ్చు. ఈ పథకం కింద ఖాతాదారుడు గరిష్టంగా 7 లక్షల రూపాయల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈడీఎల్‌ఐ పథకం ప్రయోజనాన్ని పొందడానికి ఈ-నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఈ-నామినేషన్ లేకుండా డబ్బు క్లెయిమ్ చేయలేరు. ఈ పరిస్థితిలో డబ్బు తీసుకోవడానికి నామినీ సర్టిఫికేట్ తయారు చేయాలి.

ఈ-నామినేషన్ ప్రక్రియ ఎలా చేయాలి..?

ఈ-నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి epfindia.gov.inని క్లిక్ చేయండి.

2. సేవా ఎంపికను ఎంచుకోండి.

3. తర్వాత ఈపీఎఫ్‌వో, UAN నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయండి.

4. మేనేజ్ ఎంపికపై క్లిక్ చేయండి.

5. వివరాలు అందించు ఎంపికపై క్లిక్ చేయండి.

6. ఫ్యామిలీ డిక్లరేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా అన్ని వివరాలను అందించండి.

7. తర్వాత సేవ్ ఈపీఎఫ్ నామినేషన్ నింపండి.

8. దీంతో ఈ -నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

9. తర్వాత మీరు ఈడీఎల్‌ఐ పథక ప్రయోజనాన్ని సులభంగా పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories