Dhanteras 2024: 10 నిమిషాల్లోనే గోల్డ్‌ హోమ్‌ డెలివరీ.. ధన త్రయోదశి స్పషల్

Dhanteras 2024: 10 నిమిషాల్లోనే గోల్డ్‌ హోమ్‌ డెలివరీ.. ధన త్రయోదశి స్పషల్
x
Highlights

Gold and silver online shopping on Dhanteras 2024: ప్రస్తుతం ఈకామర్స్‌ రంగం ఏ రేంజ్‌లో విస్తరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్విక్‌...

Gold and silver online shopping on Dhanteras 2024: ప్రస్తుతం ఈకామర్స్‌ రంగం ఏ రేంజ్‌లో విస్తరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్విక్‌ కామర్స్‌తో కేవలం పది నిమిషాల్లోనే ఆన్‌లైన్‌లో ఏది ఆర్డర్ చేస్తే అది డెలివరీ చేస్తున్నారు. నిత్యవసర వస్తువుల నుండి ఇష్టమైన బిర్యానీ, ఐస్ క్రీమ్ వరకు.. అలాగే స్మార్ట్‌ ఫోన్‌ల నుండి టీవీలు ఏసీలు, ఫ్రిడ్జ్‌‌ల వరకు అన్ని డెలివరీ చేస్తున్నారు. ఆర్డర్‌ చేసిన పది నిమిషాల్లోనే ఫోన్‌లు డెలివరీ అయ్యేంత సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వేగానికి ఈ కామర్స్ ఎప్పుడో డెవలప్ అయింది.

ఇదిలా ఉంటే తాజాగా మరో అడుగు ముందుకేసి ఈసారి ఏకంగా బంగారం కూడా హోమ్‌ డెలివరీ చేసేందుకు రెడీ అయ్యారు. ధన త్రయోదశి రోజున బంగారం కొనుగోలు చేయడం ఎంతో మందికి ఆనవాయితీగా పాటిస్తుంటారు. తమ స్థాయినిబట్టి ఎంత వీలైతే అంత బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తుంటారు. జనాల్లో ఉన్న ఆ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకునేందుకు ఈకామర్స్ సంస్థలు తమ వ్యాపారాన్ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్తున్నాయి. జువెలరీ షాప్‌కు వెళ్లి కొనుగోలు చేసేంత ఓపిక లేని వారికోసం ఈ కామర్స్‌ సంస్థలు బంగారం, వెండి నాణేలను డెలివరీ చేయడానికి సిద్దమయ్యాయి.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ వంటి ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్ కేవలం 10 నిమిషాల్లో కస్టమర్లకు నాణేలను అందించేందుకు రెడీ అయ్యాయి. ఇందులో భాగంగానే ప్రముఖ జువెలరీ సంస్థలైన జోయాలుక్కాస్, మలబార్ గోల్డ్ & డైమండ్స్, తనిష్క్‌ వంటి సంస్థలు ఈ యాప్‌లతో జతకట్టినట్లు తెలుస్తోంది.

24 క్యారెట్ల 0.1 గ్రా, 0.25 గ్రా, 1 గ్రా సాధారణ గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో 5గ్రా, 11.66 గ్రా, 20 గ్రా స్వచ్ఛమైన వెండి నాణేలను క్విక్‌ ఈకామర్స్ ద్వారా అందించనున్నారు. ఆరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయన్న దాని ఆధారంగా నాణేల ధరను నిర్ణయిస్తారు. అయితే ఈ అవకాశం కేవలం ధన త్రయోదశి రోజున మాత్రమే అందుబాటులో ఉంటుందా? లేక ఆ తర్వాత కూడా కొనసాగిస్తారా అనేది వేచిచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories