Post Office: మీ పెట్టుబడి డబుల్‌ అవ్వాలా.? అయితే ఇదే బెస్ట్ ఆప్షన్‌

Double your investment in just 10 years post office fixed deposit plan details
x

Post Office: మీ పెట్టుబడి డబుల్‌ అవ్వాలా.? అయితే ఇదే బెస్ట్ ఆప్షన్‌ 

Highlights

పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ పథకాన్ని పోస్టాపీస్ ఎఫడిగా కూడా పిలుస్తుంటారు. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడి నిర్ణీత సమయం తర్వాత రెట్టింపు కావడం విశేషం.

Post Office: ఈ మధ్య కాలంలో పోస్టాఫీస్‌లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రకరకాల పథకాల పేర్లతో పోస్టాఫీస్‌లో పలు పథకాలను అందిస్తున్నారు. ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి ఆదాయం వచ్చే ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వాటిలో టైమ్‌ డిపాజిట్ పథకం ఒకటి. ఇంతకీ ఈ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టాలి.? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ పథకాన్ని పోస్టాపీస్ ఎఫడిగా కూడా పిలుస్తుంటారు. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడి నిర్ణీత సమయం తర్వాత రెట్టింపు కావడం విశేషం. ఉదాహరణకు మీరు రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నిర్ణీత కాలం తర్వాత రూ. 10 లక్షలు పొందొచ్చు. పోస్టాఫీస్‌ ఎఫ్‌డి పథకం అనేది 1,2,3 లేదా 5 ఏళ్లకు ఉంటుంది. కాలవ్యవధిని బట్టి వడ్డీ వేర్వేరుగా ఉంటుంది.

మీరు పెట్టుబడి పెట్టిన డబ్బులు డబుల్ కావాలంటే 5 ఏళ్ల ఎఫ్‌డి చేయాల్సి ఉంటుంది. ఈ ఎఫ్‌డిపై ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ పథకంలో పెట్టుబడి పెడితే ఇన్‌కంటాక్స్ సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు సైతం వర్తిస్తుంది. ఉదాహరణకు మీరు ఈ పథకంలో రూ. 5 లక్షల పెట్టుబడి పెట్టారనుకోండి.

ఇలా 5 ఏళ్లకు ఇన్వెస్ట్ చేసే 7.5 శాతం వడ్డీ చొప్పున 5 ఏళ్లలో మీ డబ్బులపై 2,24,974 రూపాయలు వడ్డీ లభిస్తుంది. దీంతో మీ డబ్బు రూ. 7,24,974 రూపాయలవుతుంది. ఆ తరువాత మరో ఐదేళ్లకు పొడిగిస్తే 5,51,175 రూపాయలు కేవలం వడ్డీ లభిస్తుంది. అంటే పదేళ్ల తరువాత మొత్తం మీకు 10 లక్షల 51 వేల 175 రూపాయలు చేతికి అందుతాయి. ఈ లెక్కన 10 ఏళ్లలో మీ డబ్బులు డబుల్ అవుతాయి. పోస్టాఫీసు 1 ఏడాది ఎఫ్‌డిని మెచ్యూరిటీ కంటే 6 నెలల్లోపు పొడిగించవచ్చు. 2 ఏళ్ల ఎఫ్‌డీని అయితే 12 నెలల్లోపు 3 లేదా 5 ఏళ్ల ఎఫ్‌డీని 18 నెలల్లోపు పొడిగించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories