Post Office Scheme: జీరో రిస్క్‌తో మీ అమౌంట్‌ రెట్టింపు..!

Double Your Amount With Zero Risk in Post Office Kisan Vikas Patra Scheme
x

Post Office Scheme: జీరో రిస్క్‌తో మీ అమౌంట్‌ రెట్టింపు..!

Highlights

Post Office Scheme: జీరో రిస్క్‌తో మీ అమౌంట్‌ రెట్టింపు..!

Post Office Scheme: సురక్షితమైన పెట్టుబడుల వల్ల మీ భవిష్యత్‌ కూడా సురక్షితంగా ఉంటుంది. రిస్క్‌ ప్రకారం మార్కెట్‌లో అనేక రకాల పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి. మీకు ఎక్కువ లాభాలు కావాలంటే ఎక్కువ రిస్క్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలలో పెట్టుబడి పెట్టవచ్చు. రిస్క్‌ వద్దు సురక్షితమైన పెట్టుబడి కావాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్‌లు మంచి ఎంపికని చెప్పవచ్చు.

పోస్టాఫీసు పథకాలు దీర్ఘకాలిక పెట్టుబడులు. ఈ పథకాలు సాంప్రదాయ పెట్టుబడిదారులకి బాగా ఉపయోగపడుతాయి. పోస్టాఫీసు పథకాలపై ప్రభుత్వ గ్యారెంటీ అందుబాటులో ఉంటుంది. అంటే ఇందులో ఎలాంటి ప్రమాదం ఉండదు. అలాగే పెట్టుబడిపై హామీతో కూడిన రాబడి ఉంటుంది. కిసాన్ వికాస్ పత్ర అనే పోస్టాఫీసు పథకం గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కిసాన్ వికాస్ పత్ర పథకం (KVP)

ఈ పథకం కాలవ్యవధి 124 నెలలు అంటే 10 సంవత్సరాల 4 నెలలు. అంటే ఇందులో పెట్టుబడి పెడితే మీ అమౌంట్‌ 10 సంవత్సరాల 4 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. కనీసం రూ.1,000 పెట్టుబడితో కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికేట్ కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ పథకంలో మీకు కావలసినంత డబ్బు పెట్టవచ్చు. ఈ పథకం 1988లో ప్రారంభించారు. అప్పుడు రైతుల పెట్టుబడిని రెట్టింపు చేయడానికి ప్రారంభించారు. కానీ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.

కిసాన్ వికాస్ పత్ర లక్షణాలు

1.ఈ పథకంపై హామీతో కూడిన రాబడి వస్తుంది. దీనికి మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేదు. కాబట్టి ఇది పెట్టుబడికి సురక్షితమైన మార్గం. వ్యవధి ముగిసిన తర్వాత మీరు పూర్తి మొత్తాన్ని పొందుతారు

2.ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉండదు. దీనిపై వచ్చే రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది.

3.దీని లాక్-ఇన్ వ్యవధి 30 నెలలు. దీనికి ముందు ఖాతాదారు చనిపోతే లేదా కోర్టు ఉత్తర్వు ఉంటే తప్ప మీరు పథకం నుంచి డబ్బును ఉపసంహరించుకోలేరు

4.1000, 5000, 10000, 50000 డినామినేషన్లలో పెట్టుబడి పెట్టవచ్చు.

5.మీరు కిసాన్ వికాస్ పత్రాన్ని తాకట్టుగా లేదా సెక్యూరిటీగా ఉంచడం ద్వారా రుణం తీసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories