PM Kisan Yojana: పొరపాటున కూడా ఈ పని చేయవద్దు.. లేదంటే మొత్తం తిరిగి ఇవ్వాల్సిందే..!

Dont Make This Mistake Even by Mistake in PM Kisan Yojana Full Refund Will be Taken
x

PM Kisan Yojana: పొరపాటున కూడా ఈ పని చేయవద్దు.. లేదంటే మొత్తం తిరిగి ఇవ్వాల్సిందే..!

Highlights

PM Kisan Yojana: దేశంలోని కోట్లాది మంది పేదరైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ యోజన స్కీంని ప్రవేశపెట్టింది.

PM Kisan Yojana: దేశంలోని కోట్లాది మంది పేదరైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ యోజన స్కీంని ప్రవేశపెట్టింది. దీని కింద ప్రతి ఏడాది రూ.6000 ఆర్థిక సాయం అందజేస్తోంది. చాలామంది దీని కింద లబ్ధి పొందుతున్నారు. ఇప్పటికే ఈ స్కీం కింద 15 ఇన్‌స్టాల్‌మెంట్లు రైతులకు చెల్లించారు. ఫిబ్రవరిలో 16 వ ఇన్‌స్టాల్‌మెంట్‌ వస్తుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు రైతులకు ఇచ్చే మొత్తం కూడా పెరగవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కొంతమంది దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. అర్హులు కాకపోయినా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం వీరిపై చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. అనర్హుల నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేస్తోంది.

ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతులకు ప్రతి సంవత్సరం ఆర్థిక సాయంగా రూ.6,000 అందజేస్తారు. ఈ మొత్తం మూడు విడతలుగా విడుదలై నేరుగా రైతుల ఖాతాలకు చేరుతుంది. రానున్న బడ్జెట్‌లో ఈ కిసాన్ యోజన మొత్తాన్ని రూ.8 వేలకు పెంచవచ్చని అధికారులు చెబుతున్నారు. PM కిసాన్ యోజన లబ్ధిదారుల కోసం కొన్ని నియమాలు ఉన్నాయి. ఇందులో మొదటి షరతు ఏంటంటే లబ్ధిదారు కచ్చితంగా సాగు భూమిని కలిగి ఉండాలి.

కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఈ స్కీంకి అప్లై చేసుకోవచ్చు. ఒకే కుటుంబంలోని ఇద్దరు సభ్యులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అంతేకాదు ఇంతవరకు పొందన మొత్తం డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఖాతాలను పరిశీలించి అనర్హులను జాబితా నుంచి తొలగిస్తున్నారు. మీరు అర్హత గల అభ్యర్థి అయితే పీఎం కిసాన్ యోజన డబ్బు మీ ఖాతాలోకి రాకపోతే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముందుగా మీరు ఇచ్చిన బ్యాంక్ వివరాలు సరైనవో కాదో చెక్‌ చేయండి. తర్వాత మీ KYC స్టేటస్‌ను చెక్‌ చేయండి. ఎందుకంటే KYC లేకుండా మీరు ఈ పథకం ప్రయోజనాలను పొందలేరు.

Show Full Article
Print Article
Next Story
More Stories