Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌

Domestic Stock Market Ends With Gains
x

Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ 

Highlights

Stock Market: 89 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గురువారం లాభాలతో ముగిసింది. ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ మొదలుపెట్టిన మార్కెట్లు.. కాసేపటికే పుంజుకున్నాయి. ఆఖరి అరగంటలో అమ్మకాల సెగతో ఇంట్రాడేలో గరిష్ఠాల నుంచి దిగొచ్చినప్పటికీ.. లాభాలను నిలబెట్టుకోగలిగింది. దీంతో వరుసగా రెండో రోజూ లాభాలు నమోదయ్యాయి. ఐటీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ రంగాల షేర్లు రాణించడంతో సూచీలు నాలుగు వారాల గరిష్ఠాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ 306 పాయింట్లు లాభపడి.. 65 వేల 982 దగ్గర స్థిరపడగా...నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 19 వేల 765 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ సూచీలో టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, విప్రో, టాటా మోటార్స్‌, టైటన్‌, సన్‌ఫార్మా, టాటా స్టీల్‌ షేర్లు లాభాలతో ముగిశాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories