Credit Card: క్రెడిట్‌ కార్డు ఉపయోగిస్తారా.. పెనాల్టీని సేవ్‌ చేసే పద్దతి తెలుసుకోండి..!

Do You Use A Credit Card Know The Method To Save The Penalty
x

Credit Card:క్రెడిట్‌ కార్డు ఉపయోగిస్తారా.. పెనాల్టీని సేవ్‌ చేసే పద్దతి తెలుసుకోండి..!

Highlights

Credit Card:క్రెడిట్‌ కార్డు ఉపయోగిస్తారా.. పెనాల్టీని సేవ్‌ చేసే పద్దతి తెలుసుకోండి..!

Credit Card: క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే ప్రతి నెలా విద్యుత్ బిల్లులతో సహా అనేక రకాల బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డ్ చెల్లింపును మాత్రం గడువు తేదీలోగా చెల్లించాలి. ఒకవేళ మరచిపోయినట్లయితే భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది. కానీ కొత్త నిబంధనల ప్రకారం గడువు తేదీలోగా చెల్లించకపోయినా పెనాల్టీ ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ ఎటువంటి ఛార్జీ లేకుండా కస్టమర్లకు ఈ అవకాశాన్ని అందించింది. దాని గురించి తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌ల కోసం 21 ఏప్రిల్ 2022న జారీ చేసిన డైరెక్షన్ ప్రకారం కార్డ్ జారీచేసేవారు క్రెడిట్ కార్డ్ ఖాతాను గతంలో చెల్లించినట్లు చూపుతారని RBI తెలిపింది. క్రెడిట్ కార్డ్ చెల్లింపు గడువు తేది దాటి మూడు రోజులు గడిస్తే మాత్రమే పెనాల్టీ ఛార్జీలు, ఆలస్య రుసుము, ఇతర ఛార్జీలు వర్తిస్తాయి. అంటే మూడు రోజులలోపు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లిస్తే అదనపు పెనాల్టీని నివారించవచ్చు.

క్రెడిట్ స్కోర్ ప్రభావితం కాదు:

మీరు క్రెడిట్ కార్డ్ చెల్లింపు గడువు తేదీని మిస్ అయినట్లయితే గడువు తేదీ నుంచి మూడు రోజులలోపు చెల్లింపు చేయవచ్చు. ఆలస్య చెల్లింపు పెనాల్టీని నివారించవచ్చు. దీంతో పాటు మూడు రోజుల్లో చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ కూడా ప్రభావితం కాదు. దీని వల్ల భవిష్యత్తులో లోన్ తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఆలస్య రుసుము:

బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ జారీ చేసేవారు సాధారణంగా బకాయి ఉన్న బ్యాలెన్స్‌పై ఆధారపడి ఆలస్య చెల్లింపు ఛార్జీలు నిర్ణయిస్తారు. బిల్లు మొత్తం ఎక్కువైతే ఆలస్య రుసుము ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు బకాయి మొత్తం రూ.500 కంటే ఎక్కువ, రూ.1,000 కంటే తక్కువ ఉంటే ఎస్బీఐ ఆలస్య రుసుము రూ.400 వసూలు చేస్తుంది. అయితే బకాయి మొత్తం రూ. 1,000 కంటే ఎక్కువ రూ. 10,000 కంటే తక్కువ ఉంటే అప్పుడు రూ. 750 వసూలు చేస్తుంది. అదేవిధంగా రూ.10,000 నుంచి రూ.25,000 వరకు బకాయి ఉన్న మొత్తానికి రూ.950 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories