Number 1 Beer Brand: మందు బాబులు..భారత్‎లో నెంబర్ వన్ బీర్ బ్రాండ్ ఏదో తెలుసా?

Number 1 Beer Brand:  మందు బాబులు..భారత్‎లో నెంబర్ వన్ బీర్ బ్రాండ్ ఏదో తెలుసా?
x
Highlights

Number 1 Beer Brand: దేశంలో అన్నింటి కంటే ఫుల్ డిమాండ్ ఆల్కాహాల్ కు ఉంటుంది. ఎందుకంటే దేశంలో మద్యం ప్రియులకు కొదవేలేదని చెప్పవచ్చు. స్కాచ్, రమ్,...

Number 1 Beer Brand: దేశంలో అన్నింటి కంటే ఫుల్ డిమాండ్ ఆల్కాహాల్ కు ఉంటుంది. ఎందుకంటే దేశంలో మద్యం ప్రియులకు కొదవేలేదని చెప్పవచ్చు. స్కాచ్, రమ్, వొడ్కా, బీర్, ఇలా ఎన్నో రకాల మద్యం మందుబాబులకు అందుబాటులో ఉన్నాయి. అయితే వేసవి కాలంలో ఎక్కువగా బీర్ తాగుతుంటారు. మరీ మద్యం ప్రియులకు దేశంలో ఏ బీర్ బ్రాండ్ నెంబర్ వన్ అనే విషయం తెలుసా.

దేశంలో ఎన్న రకాల బీర్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త కొత్త రకాలు కూడా మార్కెట్లో వస్తున్నాయి. ఎన్ని కొత్త బ్రాండ్లు వచ్చినా ఒక్క బ్రాండ్ మాత్రమే అత్యధికంగా అమ్ముడుపోతుంది. ఇదే ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 బీర్ బ్రాండ్ గా మరింత పాపులర్ అయ్యింది. అదే కింగ్ ఫిషర్ ప్రీమియం బీర్. ఈ బీర్ ను యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ తయారు చేస్తోంది. ఇండియాలో దీన్ని ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. ఈ బ్రాండ్ 1978 నుంచి ప్రారంభం అయ్యింది.

దాదాపు 5 దశాబ్దాలు గడుస్తున్నా దీనికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ చాలా మంది దీన్ని ఫేవరేట్ డ్రింక్ అని చెబుతుంటారు. కింగ్ ఫిషర్ బీర్ ఇప్పుడు భారత్ లోనే కాకుండా 60కిపైగా దేశాల్లోనూ అమ్ముడవుతోంది. కింగ్ ఫిషర్ ప్రీమియం బీర్ తయారీ కోసం మంచి క్వాలిటీ ఉండే మాల్టెడ్ బార్లీ, సాజ్ హాఫ్స్ తో తయారు చేస్తారు. ఈ సాజ్ హాఫ్స్ లో యాసిడ్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

దీంతోపాటు కార్ల్స్ బర్గ్ లైట్ బీర్..1847లో బ్రూవర్ జెస్సీ జాకబ్ సెన్ స్థాపించారు. జెస్సీ తన కొడుకు కార్ల్ జాకబ్సెన్ పేరు మీద ఈ బ్రాండ్ కు పేరు పెట్టారు. ఈ రకం బీరులో తక్కువ కేలరీలు ఉంటాయి. తృణధాన్యాలు, పండ్లతో ఈ బీరును తయారు చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories