ఎస్బీఐ, ఐసీఐసీఐ మినిమమ్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా.. లేదంటే బాదుడే..!

Do you know the minimum balance of SBI and ICICI
x

ఎస్బీఐ, ఐసీఐసీఐ మినిమమ్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా.. లేదంటే బాదుడే..!

Highlights

ఎస్బీఐ, ఐసీఐసీఐ మినిమమ్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా.. లేదంటే బాదుడే..!

Banking Rules: నేటి కాలంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా కలిగి ఉంటారు. ఇక్కడ ఎటువంటి భయం లేకుండా డబ్బును దాచుకోవచ్చు. బ్యాంకులు కూడా తమ ఖాతాదారులకు అనేక రకాల సౌకర్యాలను అందిస్తాయి. అయితే సౌకర్యాలతో పాటు కస్టమర్‌లు కొన్ని ముఖ్యమైన నిబంధనలను కూడా పాటించాలి. ఇందులో ముఖ్యమైనది పొదుపు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించడం. (సేవింగ్ అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్). ఈ విషయంలో వివిధ బ్యాంకులు వివిధ రకాలుగా ఉంటాయి. ఒక వ్యక్తి ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే బ్యాంకు అతని నుంచి పెనాల్టీని వసూలు చేస్తుంది. ప్రతి వ్యక్తి కనీసం తన ఖాతాలో ఉంచుకోవాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ గురించి తెలుసుకుందాం.

కనీస బ్యాలెన్స్ మొత్తం బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. మీరు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే బ్యాంకుకు పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. దేశంలోని రెండు పెద్ద బ్యాంకులు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI బ్యాంక్ కస్టమర్ల కోసం వేర్వేరు మినిమమ్ బ్యాలెన్స్ మొత్తాన్ని నిర్ణయించాయి. ఈ రెండు బ్యాంకులలో మీకు అకౌంట్‌ ఉంటే మినిమమ్ బ్యాలెన్స్ గురించి తెలుసుకోండి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఖాతా అర్బన్ ఏరియా బ్రాంచ్‌లో ఉన్నట్లయితే తప్పనిసరిగా కనీసం రూ.1,000 ఉంచుకోవాలి. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల ఖాతాదారులకు కనీస నిల్వ మొత్తం రూ.1,000 అదేవిధంగా మెట్రో నగరంలో రూ.3వేలుగా నిర్ణయించారు.

ఐసిఐసిఐ బ్యాంక్

ఐసిఐసిఐ బ్యాంక్ ప్రకారం అర్బన్ లేదా మెట్రో సిటీలో ఖాతా ఉంటే మీరు తప్పనిసరిగా కనీసం రూ.10,000 బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలి. సెమీ అర్బన్‌లో ఈ మొత్తం రూ.5,000, గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొత్తం కనీసం రూ.2,500 ఉండాలి. లేని పక్షంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories