Ration Card: సామాన్యులకు బిగ్ షాక్.. రేషన్ కార్డులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

Digitisation Drive Transforms PDS System Nearly 6 Crore Fake Ration Cards Eliminated Says Centre
x

Ration Card: సామాన్యులకు బిగ్ షాక్.. రేషన్ కార్డులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

Highlights

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్లంతా రేషన్ కార్డు తీసుకునేందుకు అర్హులు. ఈ రేషన్ కార్డుల ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు వారి కోసం అమలు చేస్తుంటాయి.

PDS System: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఏ పథకం ప్రయోజనం పొందాలన్నా రేషన్ కార్డులే కీలకం. ఇలా రేషన్ కార్డుల జారీలో రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేస్తుండగా, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుదారుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. బోగస్ రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియలో భాగంగా రేషన్ కార్డులను పెద్ద ఎత్తున రద్దు చేస్తున్నారు. ఓ వైపు రేషన్ కార్డులను డిజిటలైజ్ చేస్తూనే మరోవైపు నకిలీ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియను ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులను రద్దు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్లంతా రేషన్ కార్డు తీసుకునేందుకు అర్హులు. ఈ రేషన్ కార్డుల ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు వారి కోసం అమలు చేస్తుంటాయి. ప్రభుత్వాల నుంచి లబ్ధి చేకూరే ఏ పథకం కావాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. అందుకే దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు రేషన్ కార్డులు తీసుకునేందుకు ముందు వరుసలో ఉంటారు. ఇప్పటివరకు భారతదేశంలో కొన్ని కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే ఈ రేషన్ కార్డుల విషయమై ఎప్పటికప్పుడు కీలక చర్యలు చేపడుతున్న కేంద్రం.. బోగస్ కార్డుల ఏరివేతకు కసరత్తులు షురూ చేసింది.

రేషన్ కార్డుల డిజిటలైజేషన్ ప్రజాపంపిణీ వ్యవస్థలో కీలక మార్పులను తీసుకొచ్చిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీని వల్ల ప్రపంచానికి ఆహార భద్రతలో భారతదేశం బెంచ్‌మార్క్‌ను నమోదు చేసిందని తెలిపింది. భారతదేశంలో రేషన్ కార్డులు ఉన్న మొత్తం 80.6 కోట్ల మంది లబ్ధిదారులు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఆధార్ కార్డు వెరిఫికేషన్, ఈ-కేవైసీ వెరిఫికేషన్ ద్వారా నకిలీ రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియ చేపట్టామని కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్లు వెల్లడించారు.

కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం.. దేశంలో ఇప్పటి వరకు 20.4 కోట్ల రేషన్ కార్డులు డిజిటలైజ్ అయినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా 5.33 లక్షల చౌక ధరల దుకాణాల్లో ఈ-పోస్ పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. వీటి ద్వారా దేశంలోని 99.8 శాతం రేషన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానం చేయగా.. అందులో 98.7 శాతం మంది లబ్ధిదారులను ధృవీకరించారు. మరోవైపు, ఇప్పటివరకు 64 శాతం మంది లబ్ధిదారులు ఇ-కెవైసి ప్రక్రియ ద్వారా ధృవీకరించబడ్డారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని రేషన్ కార్డుదారులకు ఆహార పదార్థాల సరఫరాలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ఎఫ్‌సిఐ కూడా పటిష్ట చర్యలు తీసుకుంటోందని కేంద్ర ప్రభుత్వం వివరించింది.

వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను రైల్వేతో అనుసంధానం చేసి వస్తువుల తరలింపును ఎప్పటికప్పుడు ట్రాక్ చేసినట్లు వెల్లడించారు. వన్ నేషన్-వన్ రేషన్ కార్డు పథకం అమలుతో దేశంలో ఎక్కడైనా చౌక ధరలకే రేషన్ సరుకులు కొనుగోలు చేసే అవకాశం లబ్ధిదారులకు లభిస్తుందని చెబుతున్నారు. ఆహారం కోసం ఇతర నగరాలు, రాష్ట్రాలకు వలస వెళ్లిన వారికి ఇది ఎంతో మేలు చేస్తుందని వెల్లడించారు. రేషన్ కార్డు ఉంటే.. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఎక్కడికైనా బియ్యం, ఇతర సరుకులు పొందే వెసులుబాటును నరేంద్ర మోదీ ప్రభుత్వం కల్పించింది.

పేదలను దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్రాలు రేషన్ కార్డులు జారీ చేస్తుండగా.. నకిలీ పత్రాలను సృష్టించి వాటితో కొందరు ధనవంతులు కూడా రేషన్ కార్డులు తీసుకున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో బోగస్ కార్డుల ఏరివేత పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే బోగస్ రేషన్ కార్డుల విషయమై ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఒక వైపు రేషన్ కార్డులను డిజిటలీకరణ చేస్తూనే.. మరోవైపు ఫేక్ రేషన్ కార్డులు ఏరివేసే ప్రక్రియను ముమ్మరంగా సాగించాలని నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories