Cyber Attack: అమెరికాలో సైబర్ దాడి.. 520 కోట్లు డిమాండ్

Biggest Cyber Attack in The World They Demands 520 Crores
x

సైబర్ ఎటాక్ (ఫోటో: డెక్కన్ హెరాల్డ్)

Highlights

Cyber Attack: టెక్నాలజీలో రారాజు అనుకునే ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకి హ్యాకర్లు పెద్ద షాక్ ఇచ్చారు.

Cyber Attack: టెక్నాలజీలో రారాజు అనుకునే ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకి హ్యాకర్లు పెద్ద షాక్ ఇచ్చారు. ఫ్లోరిడాలో ఉన్న ఐటీ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ కేసాయ విఎస్ఏ ని హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు దాదాపుగా 520 కోట్లు డిమాండ్ చేసారు. సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ కేసాయ తో పాటు ఆ కంపెనీకి సంబందించిన కంపెనీలపై కూడా ఈ సైబర్ దాడి జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ దాడి రాన్సన్ వేర్ గ్యాంగ్ డార్క్ వెబ్‌సైట్ హ్యాపీ బ్లాగ్ ద్వారా ఈ సైబర్ దాడి చేసినట్టు ఎఫ్ బి ఐ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో జెనివాలో జరిగిన సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైబర్ దాడులను వీలైంత త్వరగా అరికట్టడానికి తమతో కలిసి పనిచేయాలని ప్రకటించిన కొద్ది రోజులకే ఈ సైబర్ దాడి జరగడంతో సాఫ్ట్ వేర్ వ్యవస్థ ఒక్కసారిగా షాక్ గురైంది.

అయితే మరోపక్క రష్యాకి ఈ సైబర్ దాడితో సంబంధాలు ఉన్నాయని పలువురు సైబర్ నిపుణులు అనుమానాలను బయటపెడుతున్నారు. ఒకవేళ సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేసిన 70 మిలియన్ డాలర్స్ అక్షరాల భారత కరెన్సీ లో 520 కోట్ల రూపాయలు చెల్లించినట్లయితే ప్రపంచంలోనే ఇది అతిపెద్ద సైబర్ దాడిగా నిలుస్తుంది. ఈ సైబర్ దాడి నుండి బయటపడటానికి పలువురు సైబర్ నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కేసయా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ కు అమెరికా, కెనడా, జర్మనీ సహా అనే దేశాలలో దాదాపుగా 200 కంపెనీలపై ఈ సైబర్ దాడి ప్రభావం ఉన్నట్లు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories