ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఇక్కడ ఫిర్యాదు చేయండి..?

Complain to IRDAI if Insurance Companies Are in Trouble
x

ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఇక్కడ ఫిర్యాదు చేయండి..?

Highlights

ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఇక్కడ ఫిర్యాదు చేయండి..?

IRDAI: మీరు ఏదైనా ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి పాలసీని కొనుగోలు చేసి దానికి సంబంధించి ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. సదరు కంపెనీ ఈ విషయాన్ని పట్టించుకోపోతే మీరు నేరుగా బీమా నియంత్రణ సంస్థ IRDAIకి ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఏ విధంగా కంప్లెయింట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఇన్సూరెన్స్‌ కంపెనీతో సంతృప్తి చెందకపోతే కంపెనీ బ్రాంచ్‌లోని ఫిర్యాదుల పరిష్కార అధికారి (GRO)ని సంప్రదించవచ్చు. ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నప్పుడు రాతపూర్వక ఫిర్యాదు పేపర్‌తో పాటు అవసరమైన అన్ని పత్రాలను కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. ఫిర్యాదుపై తేదీతో పాటు రికార్డు కోసం రసీదు తీసుకోండి. బీమా కంపెనీ 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తుంది. 15 పని దినాలలో కంపెనీ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదంటే మీరు IRDAIని సంప్రదించవచ్చు.

IRDAIలో ఈ విధంగా ఫిర్యాదు చేయవచ్చు

IRDAI వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఈ పరిస్థితిలో IRDAIకి సంబంధించి వినియోగదారుల వ్యవహారాల విభాగంలోని గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్‌ని సంప్రదించాలి. దీని కోసం టోల్ ఫ్రీ నంబర్ 155255 లేదా 1800 4254 732కు కాల్ చేయవచ్చు. లేదంటే కంప్లెయింట్ @irda.gov.in కు ఈ-మెయిల్ చేయవచ్చు.

IRDAIకి మీ ఫిర్యాదు లేఖ లేదా ఫ్యాక్స్ పంపండి

రెగ్యులేటర్ అధికారిక వెబ్‌సైట్ నుంచి https://www.policyholder.gov.in/uploads/CEDocuments/complaintform.pdf లింక్‌లో ఫిర్యాదు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి. ఈ ఫారమ్‌ను పూర్తిగా నింపి అవసరమైన పత్రాలను జతచేసి పోస్ట్ లేదా కొరియర్ ద్వారా కింది చిరునామాకు పంపండి.

జనరల్ మేనేజర్,

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI),

డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ - గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్,

సర్వే నెం. - 115/1, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్‌గూడ,

గచ్చిబౌలి, హైదరాబాద్- 500032.

IRDAIలో నమోదైన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా ఇన్సూరెన్స్‌ కంపెనీ పరిష్కరించాల్సి ఉంటుంది. అలాగే సదరు కంపెనీ అందించే రిజల్యూషన్‌తో మీరు సంతృప్తి చెందకపోతే ఫిర్యాదు అంబుడ్స్‌మన్ పరిధిలోకి వస్తే ఇన్సూరెన్స్‌ అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories