NTPC Green Energy IPO: ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ కోసం అప్లై చేశారా..? నేడే షేర్ల కేటాయింపు..ఇలా చెక్ చేసుకోండి

NTPC Green Energy IPO
x

NTPC Green Energy IPO

Highlights

NTPC Green Energy IPO: ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ షేర్ల కేటాయింపు సోమవారం పూర్తయ్యింది. వివరాలను ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. కాగా ఈ IPO లిస్టింగ్ నవంబర్ 27న ఉంది.

NTPC Green Energy IPO: ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ షేర్ల కేటాయింపు సోమవారం పూర్తయ్యింది. వివరాలను ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. కాగా ఈ IPO లిస్టింగ్ నవంబర్ 27న ఉంది. ఈ ఐపీఓ కోసం అప్లయ్ చేసుకున్నవారు తమ షేర్లు అలాట్ అయ్యాయో లేదో ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు. ఎలా చూద్దాం.

బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అధికారిక వెబ్ సైట్లో ఎన్టీపీసీ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ ను చూసుకోవచ్చు. దీనికోసం ఇన్వెస్టర్స్ సెక్షన్ లోకి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ పేజీపై క్లిక్ చేయాలి. BSE లింక్‌కి నేరుగా లాగిన్ అవ్వండి - bseindia.com/investors/appli_check.aspx;

ఇష్యూ టైప్ ఆప్షన్‌లో 'ఈక్విటీ'ని ఎంచుకోండి:

-ఇందులో అప్లికేషన్ నంబర్ లేదా పాన్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయాలి.

- దీని తర్వాత I'm not a robot'పై క్లిక్ చేసి

- ఆపై 'సెర్చ్' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

-మీ NTPC గ్రీన్ ఎనర్జీ IPO కేటాయింపు స్టేటస్ మీ కంప్యూటర్ మానిటర్ లేదా మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

KFin టెక్ పోర్టల్‌లో స్టేటస్ ఎలా చెక్ చేయాలి:

-ముందుగా KFin Tech పోర్టల్ లింక్‌కి వెళ్లండి- kosmic.kfintech.com/ipostatus

-ఇప్పుడు 'NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్' సెలక్ట్ చేసుకోవాలి.

- ఆపై 'అప్లికేషన్ నంబర్, డీమ్యాట్ ఖాతా లేదా పాన్'లో ఏదైనా ఒకదాన్ని సెలక్ట్ చేసుకుని అప్లికేషన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.

- క్యాప్చాను ఎంటర్ చేసి మీ NTPC గ్రీన్ ఎనర్జీ IPO కేటాయింపు స్టేటస్ మీ కంప్యూటర్ మానిటర్ లేదా మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

అన్ లిస్టెడ్ మార్కెట్లో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ షేర్లు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 2 నుంచి రూ. 4 వరకు పెరిగింది. స్టాక్ మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో లిస్టింగ్ సమయానికి జీఎంపీ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఐపీఓ ఇష్యూ ధర రూ. 108తో పోల్చితే రూ. 112 వద్ద షేర్లు లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories