May 1 Changes: మే 1 నుంచి జరిగే మార్పులు.. ఖరీదైన సిలిండర్ల నుంచి బ్యాంకు సెలవుల వరకు..!

Changes from May 1 From expensive cylinders to bank holidays | May 2022 Changes
x

May 1 Changes: మే 1 నుంచి జరిగే మార్పులు.. ఖరీదైన సిలిండర్ల నుంచి బ్యాంకు సెలవుల వరకు..!

Highlights

May 1 Changes: ప్రతి నెలా ఒకటో తారీఖు జీతం వస్తుంది.. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవదు...

May 1 Changes: ప్రతి నెలా ఒకటో తారీఖు జీతం వస్తుంది.. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవదు. కారణం రోజు రోజుకి పెరుగుతున్న ధరలు. తరచుగా నెల ప్రారంభంలో కొన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. మరికొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి. మే నెల కూడా చాలా పెద్ద మార్పులతో ప్రారంభం కానుంది. ఈ పరిస్థితిలో ఏ విషయాలలో మార్పులు ఉంటాయో ఒక్కసారి తెలుసుకుందాం.

సిలిండర్ ధరలు పెరిగే అవకాశం

ఈ నెల ప్రారంభంలో కూడా గ్యాస్ సిలిండర్ కంపెనీలు ధరలపై నిర్ణయం తీసుకోవచ్చు. దేశీయ గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకి సెలవులు

మీకు బ్యాంకులో పని ఉంటే అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. మే 1 నుంచి 4 వరకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే ఈ సెలవులు వివిధ రాష్ట్రాల ప్రకారం ఉంటాయి. దేశంలో ఈద్‌ను మే ప్రారంభంలో జరుపుకుంటారు. ఇది కాకుండా మే నెలలో శని, ఆదివారాలతో సహా 11 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి.

IPOలో UPI చెల్లింపు పరిమితి పెరుగుతుంది

మే 1 నుంచి జరగబోయే మరో పెద్ద మార్పు ఏంటంటే రిటైల్ పెట్టుబడిదారులకు UPI చెల్లింపు పరిమితి పెరుగుతుంది. SEBI కొత్త నిబంధనల ప్రకారం మే 1 తర్వాత కంపెనీ IPOలో పెట్టుబడి పెట్టడానికి UPI ద్వారా చెల్లింపు చేసేటప్పుడు మీరు రూ. 5 లక్షల వరకు బిడ్‌ను సమర్పించవచ్చు. ప్రస్తుతం ఈ పరిమితి రూ.2 లక్షల వరకు మాత్రమే ఉంది. మే 1 తర్వాత వచ్చే అన్ని IPOలకు కొత్త పరిమితి చెల్లుబాటు అవుతుంది. నవంబర్ 2018లోనే IPOలో పెట్టుబడి కోసం UPI చెల్లింపును సెబీ అనుమతించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories