DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక.. డీఏ పెంచుతూ నిర్ణయం..?

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక.. డీఏ పెంచుతూ నిర్ణయం..?
x

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక.. డీఏ పెంచుతూ నిర్ణయం..?

Highlights

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దీపావళి పండుగ బహుమతి ఇచ్చేందుకు సిద్ధమవుతోందని సమాచారం.

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దీపావళి పండుగ బహుమతి ఇచ్చేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ఈమేరకు డీఏను (కరవు భత్యం) పెంచనున్నట్లు తెలుస్తోంది. డీఏను 3 శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే ఇందుకు సంబంధించి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు సైతం వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపునకు సంబంధించి చర్చించారని, క్యాబినెట్ ఇందుకు ఆమోదం తెలుస్తోంది. బుధవారం సాయంత్రంలోగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంతో కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షన్ దారులకు లబ్ధి చేకూరనుంది. సాధారణంగా పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు. ఈ ఏడాది మార్చిలో కూడా ఉద్యోగుల డీఏను, పెన్షనర్ల డీఆర్‌ను కేంద్రం 4 శాతం పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఈ పెంపు మూడు శాతం ఉండనుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ డీఏ పెంపుతో ఇప్పటివరకు 50% డీఏ 53 శాతానికి పెరగనుంది. ఏడాది జులై 1వ తేదీ నుంచే ఈ పెంపు అమల్లోకి రానుందని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories