Pension Scheme: పెళ్లైన ప్రతి జంటకి పెన్షన్.. ఈ ఒక్క పనిచేస్తే చాలు..!

Central Government Financial Assistance of Rs.72,000 if you join the National Pension Scheme
x

Pension Scheme: పెళ్లైన ప్రతి జంటకి పెన్షన్.. ఈ ఒక్క పనిచేస్తే చాలు..!

Highlights

National Pension Scheme: మీరు వివాహం చేసుకున్నట్లయితే ఈ వార్త బాగా ఉపయోగపడుతుంది.

National Pension Scheme: మీరు వివాహం చేసుకున్నట్లయితే ఈ వార్త బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పెళ్లికూతుళ్లుగా మారిన వారికి మోడీ ప్రభుత్వం పెద్ద కానుకగా అందిస్తోంది. వివాహిత జంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.72,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. అయితే దీని కోసం పెళ్లయిన జంటలందరూ నెలకు రూ.200 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మహిళలు స్వావలంబన చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం జాతీయ పెన్షన్ పథకం కింద ఈ పథకాన్ని ప్రారంభించింది.

ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి మీకు జన్ ధన్ ఖాతా, ఆధార్ కార్డు ఉండటం అవసరం. ఇందులో రిజిస్ట్రేషన్ ప్రక్రియ తొందరగానే పూర్తవుతుంది. ఈ పథకం ప్రకారం ఒక వ్యక్తికి 30 ఏళ్లు ఉంటే అతను ఈ పథకంలో నెలకు రూ. 100 పెట్టుబడి పెట్టాలి. అంటే ఏడాదికి 1200 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు చేయాలి. మీ మొత్తం 36 వేల రూపాయలు అవుతుంది. దీని ఆధారంగా మీకు ప్రతి నెలా 3000 వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది.

మీ తర్వాత నామినీ లేదా జీవిత భాగస్వామికి ప్రతి నెలా 1500 రూపాయల పెన్షన్‌ లభిస్తుంది. భార్యాభర్తలిద్దరూ ఇందులో భాగమైతే ఇద్దరికీ నెలకు రూ.6000 పెన్షన్ లభిస్తుంది. అంటే మీరు మీ భార్యతో పాటు సంవత్సరానికి రూ. 72000 పొందుతారు. మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి మీరు ఈ పథకంలో భాగం కావచ్చు. మీరు ఇందులో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే మీ వయస్సు 18 నుంచి 40 సంవత్సరాలలోపు ఉండాలి. జాతీయ పెన్షన్ పథకం ప్రధాన లక్ష్యం రిటైర్మెంట్‌ తర్వాత పెట్టుబడిదారులందరికీ పెన్షన్ అందించడం.

జాతీయ పెన్షన్ పథకం ద్వారా పౌరులందరూ రిటైర్మెంట్‌ తర్వాత స్వావలంబన కలిగి ఉండాలి. వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఈ పథకం కింద పెట్టుబడిదారులు తమ ఆర్థిక స్థితిని బట్టి పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా ఈ పథకం కింద ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో టైర్ వన్, టైర్ టూ అని పిలువబడే రెండు రకాల ఖాతాలు ఉంటాయి. జాతీయ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories